ఘనంగా సేవా స్పూర్తి శ్రీధర్ రావు జన్మదిన వేడుకలు…

ఘనంగా సేవా స్పూర్తి శ్రీధర్ రావు జన్మదిన వేడుకలు…

  • ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ
    – 17వ వార్డు కౌన్సిలర్ పొన్నం స్వరూప రాజయ్య ఆధ్వర్యంలో కార్యక్రమాలు

స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : చిలుపూర్ గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు పుట్టినరోజు సందర్భంగా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్ పొన్నం స్వరూప రాజయ్య ఆధ్వ ర్యంలో ఆదివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ పొన్నం స్వరూప రాజయ్య మాట్లాడుతూ శ్రీధర్ రావు దీర్ఘాయుష్షుతో పాటు ఆయురారోగ్యాలు, సుఖశాంతులు పొందాలని మనస్ఫూర్తిగా ఆకాం క్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీటీసీ గోనె ల ఉపేందర్, పొన్నం నాగరాజు, రంజిత్ కుమార్, నీల పరుశరా ములు, మామిండ్ల శ్రీను, పండుగ అశోక్, మునిగేల రాజు, రమేష్, మధు, పవ న్, శ్రవణ్, వేముల రాము, పిట్టల చంద్రయ్య, ఊరడి శ్రీను, అఖిల్, కుంభం మధు, నితిన్, శాగ శివ, చెవినబోయిన అనిల్, మహేష్, పిట్టల హరీష్, పొన్నం రమేష్, శాగ శంకర్, జంపాల శీను తదితరులు పాల్గొ న్నారు.