ఎన్టీఆర్ జిల్లా డీఎంహెచ్‌వోగా డాక్టర్ ఎ.శ్రావణ్ బాబు..
కార్యాలయంలో బాధ్యతలు స్వీకరణ..
జిల్లా వైద్య సేవలను మరింత సమర్థంగా తీర్చిదిద్దుతాం.
అన్ని ప్రాంతాలలో సమగ్ర వైద్య సేవలు…
అందుబాటులో సిబ్బంది మందులు..
డి ఎం డి హెచ్ ఓ శ్రవణ్ కుమార్
కలెక్టర్ జి. లక్ష్మీ, జేసీ ఇలక్కియా, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డీఎంహెచ్‌వో..
(విజయవాడ ఆంధ్రప్రభ ) : ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ (డీఎంహెచ్‌వో) అధికారిగా డాక్టర్ ఎ. శ్రావణ్ బాబు గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం డాక్టర్ శ్రావణ్ బాబు మాట్లాడుతూ… తనకు ఆత్మీయ స్వాగతం పలికిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని, ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల అమలులో ఎన్టీఆర్ జిల్లాను రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా నిలపాలని పిలుపునిచ్చారు.

ప్రతి ఉద్యోగి నిబద్ధతతో పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం నూతన డీఎంహెచ్‌వో జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ జి. లక్ష్మీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అలాగే జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియాను కూడా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే క్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని)ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛంతో అభివాదం చేశారు.
ఈ కార్యక్రమంలో డీఐఓ డాక్టర్ జె. ఇందుమతి దేవి, డాక్టర్ శరత్ బాబు, డీఎంఓ రాజు నాయక్, డీపీఎంఓ డాక్టర్ నవీన్, డాక్టర్ సునీల్, డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ కార్తీక్, డాక్టర్ శ్రావణి తదితర అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కొత్త డీఎంహెచ్‌వో నాయకత్వంలో జిల్లా వైద్య, ప్రజారోగ్య సేవలు మరింత సమర్థవంతంగా అమలవుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
