రెవెన్యూ భూ సమస్యలు శాశ్వత పరిష్కారానికే ప్రజా దర్భార్..

రెవెన్యూ భూ సమస్యలు శాశ్వత పరిష్కారానికే ప్రజా దర్భార్..
ఒంగోలు రూరల్ , ఆంధ్రప్రభ : రెవెన్యూ భూ సమస్యలు పరిష్కారానికే ప్రజా దర్భార్ అని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. నగరంలో ఎన్టీఆర్ కళా క్షేత్రంలో శనివారం ఆర్ డీ ఓ చంద్రశేఖర్ నాయడు అధ్యక్షతన ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతు రెవెన్యూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం చేసేందుకు నగరంలో ప్రజాదర్బార్ రెవెన్యూ అధికారులు అద్వర్యంలో నిర్వహిస్తున్నాం. పేదలు భూ సమస్యలు, అన్ లైన్, పట్టదారు పాస్ పుస్తకాలు, ఇళ్ల స్థలాలు సమస్యలు పరిష్కారం చేసేందుకు ప్రజాదర్బార్. నియోజకవర్గం లో ఎక్కడ భూ సమస్యలు తో ప్రజలు ఇబ్బందులు కనపడకూడదు, రైతులు రెవెన్యూ కార్యాలయాలు చుట్టూ తిరగకుండా ఉండాలని ఈ రెవెన్యూ సదస్సులు, రెవెన్యూ లో అవినీతి నీ అరికట్టాలి అనేది కూటమి ప్రభుత్వం లక్ష్యం, 2026 చివరి నాటికి ఒంగోలు నియోజకవర్గం లో భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం చేస్తాం. ఈ కార్యక్రమం లో పలువురు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
