జాతీయ స్థాయిలో మెరిసిన యువ క్రీడాకారుడు

కేసముద్రం, ఆంధ్రప్రభ : కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలోని లక్ష్మినగర్ కు చెందిన లైబ్రరియన్ చారి అభిషేక్ కరిష్మా దంపతుల కుమారుడు చారి అభిషేక్ ప్రభంజన్ తైక్వాండో జాతీయ స్థాయి క్రీడాలో తన ప్రతిభ చాటాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కడప జిల్లా లో జరిగిన నేషనల్ గేమ్స్ లో హోరా హోరు జరిగిన తైక్వాందో పోటీలో తెలంగాణ రాష్ట్ర మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంకు చెందిన అభిషేక్ ప్రభంజన్ సిల్వర్ మెడల్ కైవసం చేసుకొని విజయ కేతానం ఎగరావేశాడు. ప్రభంజన్ గెలుపుకు సహకారం అందించిన కోచ్లకు, ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు.భవిష్యత్ లో ఇలాంటి విజయాలను అందుకుని తల్లి తండ్రులకు, పుట్టిన ఊరుకు పేరు తీసుకురావాలి అని పలువురు అభినందనలు తెలిపారు.

Leave a Reply