PhD degree | కొల్లూరు వాసికి పీహెచ్‌డీ పట్టా

PhD degree |కొల్లూరు ఆంధ్రప్రభ : కొల్లూరు గ్రామానికి చెందిన యండ్రపాటి రవీంద్ర బాబు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పీహెచ్‌డీ పొందారు. ఆదివారం కొల్లూరులో రవీంద్ర మాట్లాడుతూ.. కంప్యూటర్ ఇంజనీరింగ్ విభాగంలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీని పూర్తి చేశారన్నారు. అడాప్టివ్ రిసోర్స్ మేనేజ్మెంట్, వర్క్ ఫ్లో ఆప్టి మైజేషన్ ఇన్ బిగ్ డేటా సిస్టమ్ యూజింగ్ ఇంటిగ్రేటెడ్ డీప్ లెర్నింగ్ ఫ్రేమ్ వర్క్ అనే అంశం పై పరిశోధన చేసి పూర్తి చేశారన్నారు. యూనివర్సిటీ ఆమోదించి పీహెచ్‌డీ ప్రదానం చేసింది. రవీంద్రను గ్రామ పెద్దలు, మిత్రులు, కుటుంబ సభ్యులు అభినందించారు.

Leave a Reply