సంక్షేమం, అభివృద్ధిలో ఆదర్శం
- ప్రజా పాలనకు సంపూర్ణ మద్దతు
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, ఆంధ్రప్రభ: సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం తురుకాష్ పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ ఎస్కే హుస్సేన్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సయ్యద్ మోదిస్ సహా పలువురు గ్రామస్థులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పార్టీలో చేరిన వారికి కండువా కప్పిన ఆ హ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంలో వారు తీసుకుంటున్న నిర్ణయాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో ప్రజల ఆమోదంతో ఓట్ల శాతం పెరుగుతూ వస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 8 మంది ఎంపీలు, మున్సిపల్ సర్పంచి ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందన్నారు. వేములవాడ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు పోతున్నామని, సంక్షేమం అభివృద్ధి విషయంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. హైదరాబాదులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫోర్త్ సిటీని తన భుజ స్కందాలపై వేసుకొని అభివృద్ధి చేస్తున్నారన్నారు. మూసీ సుందరీకరణ, మెట్రో విస్తరణ వంటి అనేక కార్యక్రమాలు చె పడుతున్నారన్నారు. యువత, మేధావులు, సామాజిక కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ వేదికను చేసుకొని ముందుకు పోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రూరల్ అధ్యక్షుడు కరుణాకర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రోండి రాజు, వకుళాభరణం శ్రీనివాస్, రంగు వెంకటేష్ గౌడ్లతోపాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
