​చేనేత సహకార సంఘం ఎన్నికలకు నామినేషన్లు షురూ

​చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్ చేనేత సహకార సంఘం ఎన్నికల వేడి ఊపందుకుంది. ఎన్నికల్లో భాగంగా శుక్రవారం శ్రీ భావనాఋషి భద్రావతి దేవి ప్యానల్ అభ్యర్థులు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అభ్యర్థులుగా ​గోశిక రవి,​కందగట్ల విఠల్, ​గుర్రం నరసింహ, గోశిక పురుషోత్తం, ​గోశిక నరసింహ, ​గోశిక మురళి, ​గోశిక భాస్కర్, ​గుర్రం సత్తమ్మ, ​కోనం వినోద, ​గుర్రం నరసింహ, ​వనం పాండు తదితరులు తమ నామినేషన్లను ఎన్నికల అధికారులకు సమర్పించారు. ​ఈ నామినేషన్ల కార్యక్రమంలో చౌటుప్పల్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గోశిక స్వామి, చేనేత సహకార సంఘం మాజీ అధ్యక్షుడు గుర్రం రవీందర్, మాజీ ఉపాధ్యక్షుడు గోశిక వెంకటేశం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ​”చేనేత కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా శ్రీ భావనాఋషి భద్రావతి దేవి ప్యానెల్ బరిలోకి దిగుతోందని, సభ్యులందరూ ఈ ప్యానెల్‌ను ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని” ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.

​ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు గోశిక అంజయ్య, గజం ధనంజయ, గోశిక బిక్షపతి, వనం ధనంజయ, తడక భీమయ్య, ఒడిచర్ల రాజయ్య, సుంకి రవి, కందగట్ల మధుసూదన్, గోశిక జగన్, గుర్రం నరసింహ, తడక దామోదర్, బాలరాజు, గోషిక నరహరి, ధనుంజయ, భావన ఋషి, మహిళా నేతలు గోశిక నీరజ, గోశిక అనిత, తడక సురేఖ, గోశిక హైమావతి, నోముల శారదాంబ లతో పాటు చేనేత కార్మిక సంఘం సభ్యులు, కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సంఘం కార్యాలయం పరిసరాలు నామినేషన్ల కోలాహలంతో సందడిగా మారాయి.