ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైంది

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైందని, ప్రతి అర్హుడూ ఓటు హక్కును పొంది దానిని పరిరక్షించుకోవాలని జనగామ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ తోటకూర రమేష్, సీనియర్ నాయకులు మేకల నరేందర్ పిలుపునిచ్చారు. రఘునాథపల్లి మండలం కోమల్ల గ్రామంలో శుక్రవారం సర్ ఫామ్ ఎలా నింపాలి అనే అంశంపై గ్రామంలోని బిఎల్ఏలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఓటర్ మ్యాపింగ్, ఓటరు వివరాల సవరణ, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించి, బిఎల్ఏలకు పలు సూచనలు చేశారు. గ్రామాల్లో ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలిసి సర్ ప్రక్రియపై అవగాహన కల్పించి, ప్రతి ఒక్కరూ ఈకార్యక్రమంలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈసమావేశంలో కోమల్ల గ్రామ సర్పంచ్ వల్లాల అశోక్, గ్రామ శాఖ అధ్యక్షుడు బొల్లపల్లి కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు తాటికొండ వెంకటేష్ యాదవ్, ఏఎంసీ డైరెక్టర్ బంధ కుమార్, బిఎల్ఏలు కన్నారపు వెంకటస్వామి, బాల్నే పరశురాములు, బొల్లపల్లి కుమార్, అవదూత శ్రీనివాస్, పాశికంటి ఉపేందర్, రాజు, నగేష్, హరినాథ్, సత్తయ్య, బొల్లపల్లి సత్తయ్య, వెలిశాల స్వామి, కుంచం మైసయ్యతో పాటు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.