ప్రజాస్వామ్య హక్కులను కాలరాయొద్దు..
- తెలంగాణ రక్షణ సేన పార్టీ మండల కన్వీనర్ బానోత్ వసంత్ రావు
నేరడిగొండ, ఆంధ్రప్రభ : తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని ఆ పార్టీ మండల కన్వీనర్ బానోత్ వసంత్‌రావు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు. ఈ డిమాండ్‌తో తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి రాజకీయ పార్టీకి శాంతియుతంగా తమ రాజకీయ కార్యక్రమాలు నిర్వహించే రాజ్యాంగబద్ధమైన హక్కు ఉందని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను గౌరవిస్తూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని, అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
