అర్హులకు ఓటు హక్కు కల్పించడమే ఎస్ఐఆర్ లక్ష్యం

అర్హులకు ఓటు హక్కు కల్పించడమే ఎస్ఐఆర్ లక్ష్యం

  • 24 ఏళ్ల తర్వాత ప్రత్యేక ఓటరు జాబితా సవరణ
  • బూత్ స్థాయిలో రాజకీయ పార్టీలు పర్యవేక్షించాలి
  • జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే
  • జూలై 31న డ్రాఫ్ట్, అక్టోబర్ 1న తుది జాబితా విడుదల
  • పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి, ఆంధ్రప్రభ: జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు వాక్కు కల్పించేలా అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. బుధవారం పెద్దపల్లి ఐడీఓసీ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులతో నిర్వహించిన ఎస్ఐఆర్ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 24 సంవత్సరాల తర్వాత ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2002లో ఎస్ఐఆర్ కార్యక్రమం నిర్వహించారన్నారు. అక్టోబర్ 1వ తేదీని ప్రామాణికంగా తీసుకుని అప్పటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు వాక్కు కల్పించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు మారిన వారు, డూప్లికేట్ ఓట్ల తొలగింపు కూడా ఈ ప్రక్రియలో భాగమన్నారు. ప్రస్తుత ఓటర్ల జాబితాను 2002 నాటి ఎస్ఐఆర్ ఓటరు జాబితాతో మ్యాపింగ్ చేస్తున్నామని తెలిపారు.

2002 తర్వాత కొత్తగా చేర్చిన ఓటర్లు పాత ఓటర్లతో సంబంధాన్ని లేదా కొత్త నమోదు ఆధారాలను చూపించాలని సూచించారు. ఒకవేళ ప్రస్తుత ఓటరు పేరు 2002 జాబితాలో లేకపోతే, వారి తల్లిదండ్రులు లేదా తాతముత్తాతల పేర్లు, ఈపిక్ నంబర్ల వివరాలను ఎన్యూమరేషన్ ఫారంలో నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ దశలో ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రతి రాజకీయ పార్టీ బూత్ స్థాయిలో బీఎల్డీలను నియమించి ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని సూచించారు.

అర్హులైన ఓటరు పేరు తొలగించబడితే మళ్లీ అప్పీల్ ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేయాల్సి వస్తుందని, అది సుదీర్ఘ ప్రక్రియ అవుతుందని తెలిపారు. జిల్లాలో ఒక్క అర్హుడైన ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకూడదనేదే జిల్లా యంత్రాంగం లక్ష్యమన్నారు. జూన్ మొదటి వారంలో మండల స్థాయిలో బీఎల్వీలు, బీఎల్ఎలతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. జూన్ 15 నుంచి 24 వరకు ఎస్ఐఆర్లో పాల్గొనే బీఎల్వీలు, ఇతర సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తామని చెప్పారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్ వోలు ఇంటింటి సర్వే నిర్వహించి కొత్త ఓటర్ల నుంచి నమోదు ఫారాలు స్వీకరిస్తారని తెలిపారు. 2002 ఎస్ఐఆర్ జాబితాలో లేని ప్రతి ఒక్కరూ తిరిగి నమోదు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

Leave a Reply