CC Road | పనులకు భూమిపూజ

CC Road | వర్ని, ఆంధ్రప్రభ : వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామ పంచాయతీ పరిధిలోని కోటయ్య క్యాంపు గ్రామంలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఇవాళ సర్పంచ్ కనకదుర్గ రవి పూజ కార్యక్రమాలు నిర్వహించి పనులు ప్రారంభించారు. ఐదు లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆల గ్రామపంచాయతీ ఈవో సాయిలు, ఉప సర్పంచ్ రెడ్డి శ్రీరాములు, మాజీ ఎంపీటీసీ నాగరాజు, వార్డు సభ్యులు పంతం శంకర్, పాత లోతు రాజు, నాయకులు హర్ష, జంపాల రామకృష్ణ మాజీ వార్డు సభ్యులు అనిల్ స్వామి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
