Crime | అర్ధరాత్రి నిద్రలోనే గొంతు కోసి హత్య..

మంట కలిసిన మానవత్వం
అక్కల చేతుల తమ్ముడు దారుణ హత్య
దుబ్బగూడెంలో విషాదం

Crime | వాజేడు, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా వాజేడు మండలం దుబ్బగూడెంలో దారుణ హత్య జరిగింది. ఇదే గ్రామానికి చెందిన మడే చలపతి 35 సంవత్సరాలు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో వేట కొడవలితో పీక కోసి హతమార్చారు. ఇది తెలుసుకున్న పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. హత్య ఏ విధంగా జరిగిందనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు డాగ్ స్కాడును రప్పించి వివరాలు సేకరించనున్నట్లు సమాచారం

రోజురోజుకు ప్రపంచంలో మానవత్వం మంట కలిసిపోతుంది కన్న కొడుకు కట్టుకున్న భర్త తోబుట్టు అక్క చెల్లెల్లు అన్నదమ్ములు అనే తారతమ్యం లేకుండా ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు ఈ లోకం ఒకరు భర్తను హతమార్చి అంతకురాలుగా మారితే మరొకరు భార్యను హతమార్చి భర్త బాధ్యతను మర్చిపోతున్నాడు . ఒకే తల్లికి పుట్టిన అక్కలు తండ్రితో కలిసి తమ్ముని హతమార్చిన సంఘటన దుబ్బగూడెం గ్రామంలో చోటుచేసుకుంది ఈ విషాద ఘటన విన్న ప్రతి ఒక్కరు ఈ సమాజంలో మానవత్వానికి చోటు లేకుండా పోతుందని మతి చెల్లించిపోతున్నారు ఇది ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని కృష్ణాపురం పంచాయతీ దుబ్బగూడెం గ్రామంలో జరగడం బాధాకరంగా భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి

ములుగు జిల్లా వాజేడు మండలం దుబ్బగూడెంలో దారుణ హత్య జరిగింది. ఇదే గ్రామానికి చెందిన మడే చలపతి 35 సంవత్సరాలు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో వేట కొడవలితో పీక కోసి హతమార్చారు. ఇది తెలుసుకున్న పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. హత్య ఏ విధంగా జరిగిందనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. ఇది తెలుసుకున్న వెంకటాపురం సర్కిల్ సీఐ ముత్యం రమేష్ రంగంలోకి దిగి ఈ సంఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు డాగ్ స్కాడును రప్పించి వివరాలు సేకరించారు. దీనితో భయంకరమైన విషయాలు బయటపడ్డాయి. తమ్ముడు తరచుగా తాగి వచ్చి రోజు గొడవ పెడుతూ వారికి ఇబ్బంది కలిగిస్తున్నారని భావించిన సొంత ఇద్దరు అక్కలు ఆదిలక్ష్మి అన్న సూర్య తండ్రి మదనయ్యతో కలిసి తమ్ముడిని అతికిరాతకంగా వేట కొడవలి గొడ్డలితో గొంతుక కోసి నరికి దారుణంగా హత్య చేసినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది వీరితోపాటు అనసూయ భర్త కూడా ఈ ఘటనలో ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

24 గంటలు జరగకముందే వెంకటాపురం సిఐ ముత్యం రమేష్ పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ నిందితులను గుర్తించడం చర్చనీయాంశంగా మారింది. తమ్మున్ని అతికిరాతకంగా నరికి చంపి తమకేమీ తెలియనట్లు ప్రజల ముందు నాటకాన్ని వెళ్లబుచ్చుతూ తమ్ముని కోసం పరితపిస్తున్నట్లు కన్నీరు కార్చారు అంటే మానవత్వం ఏమైపోతుంది మానవత్వం మట్టి కలిసి పోతుందా అని పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. రక్తం పంచుకొని పుట్టిన వ్యక్తులే తన తమ్ముణ్ణి అతి కిరాతకంగా బావతో కలిసి హతమార్చడం చర్చనీయాంశంగా మారింది. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం నాటకాన్ని ప్రదర్శించినప్పటికీ డాగ్ స్కాడు నిందితులను గుర్తించడంతో అసలు విషయం బట్టబయలు అయింది. పట్టుబడిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. కృష్ణాపురం పంచాయతీ కార్యదర్శి కురుసం నరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ తెలిపారు