Monitoring | ప్రమాదాల నియంత్రణకు..
Monitoring | ప్రమాదాల నియంత్రణకు..
- నాలుగు స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు
Monitoring | నాగాయలంక, ఆంధ్రప్రభ : అవనిగడ్డ – నాగాయలంక ప్రధాన రహదారులలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనాల స్పీడులను నియంత్రించడానికి స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నట్లు నాగాయలంక ఎస్ ఐ కె.రాజేష్ తెలిపారు. ఈ రోజు నాగాయలంక సాయిబాబా కూడలిలో రెండు, రేమాలవారిపాలెం ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఒకటి, వక్కపట్ల వారి పాలెం వంతెన దగ్గర ఒకటి వెరశి నాలుగు స్పీడు బ్రేకర్ల పనులను పోలీసులతో ఎస్సై కే. రాజేష్ పర్యవేక్షించారు.
