Sankranti | గాలిపటం… చిన్నారుల… సంబరం

Sankranti | గాలిపటం… చిన్నారుల… సంబరం

  • జాగ్రత్తలు పాటిస్తేనే సంతోషాల సంక్రాంతి

Sankranti | కుంటాల, ఆంధ్రప్రభ : సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు చిన్నారులు మొదలు పెద్దల వరకు నాతో ఆడుకోవడానికి ఆసక్తి చూపుతారు. స్నేహితులందరూ భవనాలపైకి చేరుకుంటారు. గాలిలోకి ఎగరేస్తుంటారు. వివిధ విన్యాసాలు చేస్తుంటారు. చాలా ఎక్కువ ఎగురవేయాలని చూస్తుంటారు. పండుగ నేపథ్యంలో బడులకు సెలవులు వచ్చాయి. అందుకే మీ ముందుకు వచ్చాను. నేను చెప్పే సూచనలు, సలహాలు, జాగ్రత్తలు పాటిస్తే నాతో మీ పండుగ సంతోషంగా సాగుతుంది.

Sankranti |

సంక్రాంతి సంబరాలు పండుగ ప్రకృతి అందాలు, కొత్త పంటల రాక, హరిదాసు హడావుడి, ఇళ్ల ముందర రంగురంగుల ముగ్గులు, పల్లె పట్టణం నుండి గ్రామాలకు చేరుకుంటారు. కొత్త కలలు సంతరించుకుంటాయి. పెద్దలు సంబరాల్లో మునిగి తేలుతూ, మహిళలు పిండివంటలతో మునిగిపోతారు. ఇంట్లో ఉండే చిన్నారులకు గుర్తుకు వచ్చేది నాతో పిల్లలు చేసే హంగామా మామూలుగా ఉండదు. సరదాగా నన్ను ఆకాశంలో ఎగిరేలా చూడడానికి ప్రయత్నించి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది.

చైనా.. మాంజ …వద్దు

నాకు చైనా మాంజ కట్టి ఎగురవేయవద్దు. గాజు మాంజాతో చేసిన నైలాన్ దారాల ద్వారా ప్రమాదకరం, నిషేధం అని చెప్పినా మార్కెట్లో ఏదో ఒక‌ట‌ని విక్రయిస్తున్నారు. ఎగురవేసే వారి చేతుల్లో వేళ్లు తెగిపోతున్నాయి. నేను విద్యుత్ వైర్లకు, చెట్లకు చిక్కుకపోవడంతో పక్షులు నాకు చిక్కుకొని బయటకు రాలేక మరణిస్తున్నాయి, రోడ్డుపైన వెళ్లే ద్విచక్ర వాహనదారులకు నేను చుట్టుకుంటే తీవ్రంగా గాయపడే ప్రమాదం ఉంది. జాగ్రత్త పాటించి చైనా మాంజాను వాడ‌వ‌ద్దు.

విద్యుత్తు తీగలకు దూరం

విద్యుత్ తీగలు, స్తంభాలకు చిక్కుకుంటే తీయడానికి న‌న్ను తీయడానికి వెళ్లినా, చెట్టు ఎక్కినా జారీ పడితే గాయాలై కాళ్లు, చేతులు విరిగి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది. కావున జాగ్రత్తలు పాటించి జాగ్రత్తగా పతంగిని ఎగురవేసి పండుగను సంబరంగా జరుపుకోని సంతోషకరమైన సంక్రాంతి పండుగ వేళ కష్టాలను తెచ్చుకోవద్దు.

గాలిపటాలు .. ఎగురవేసేటప్పుడు పోటీలు వద్దు..

Sankranti |

నన్ను ఎత్తులో ఎగురవేయడానికి ఇతరులతో పోటీ పడవద్దు. ఇతరులకు, గాలిపటాలకు త‌గిలితే న‌న్ను తెంచవద్దు. దారం తెగి నేను గాలిలోకి ఎగురుతుంటే నాతో పరిగెత్తవద్దు. జాగ్రత్తలు పాటిస్తూ గాలిపటాలను ఎగురవేయాలి. పండుగ వేళ గాలిపటాలు ఎగురవేసేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలి. పోటీపడి పతంగులు ఎగరవేస్తే ప్రాణాలకు ప్రాణాపాయమే! పతంగులను ఎగురవేసి సంతోషకరమైన పండుగను జరుపుకోవాలి.

గాలి పటాల ఎగరవేతపై యువకులకు అవగాహన..

Sankranti |

కుంటాల ఎస్సై ఎం. అజయ్

సంక్రాంతి పండుగ సందర్భంగా కుంటాల ఎస్సై మాట్లాడుతూ.. గాలిపటాల ఎగురవేతపై యువకులకు అవగాహన కల్పిస్తున్నామ‌న్నారు. ప్రతి దుకాణాలను ఇప్పటికే రోజు వారిగా తనిఖీలు చేపట్టడం జ‌రిగింద‌న్నారు. చైనా మాంజా వాడితే కఠిన చర్యలు తీసుకుంటామ‌నీ, అధికారులు జారీ చేసిన ఆదేశాల మేరకు చైనా మాంజా వాడితే చర్యలు తీసుకోని, కేసులు నమోదు చేస్తామ‌న్నారు. పోలీసు నియమాలను ఉల్లంఘించవద్ద‌నీ, ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పండుగని సంతోషంగా జరుపుకోవాలనీ, గాలిపటాలు ఎగురవేసేటప్పుడు స్థానిక ఇండ్ల పైకి ఎక్కవద్దనీ యువకులు మైదానాలలో ఆ పతంగుల నెగిటివ్ వెయ్యాలని చెరువుల వద్ద, గుట్టల‌ సమీపంలో ఎగరవేయొద్దని సూచించారు.

Sankranti |

CLICK HERE TO READ MORE : Kidnapping | చిన్నారుల కిడ్నాప్ ముఠా గుట్టుర‌ట్టు..

CLICK HERE TO READ MORE :

Leave a Reply