Rs. 5 crore | పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సామెల్

Rs. 5 crore | పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సామెల్
Rs. 5 crore | మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో రూ.5 కోట్ల(5 crores)తో అంగడి బజార్ లో చేపడుతున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను ఇవాళ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ స్వయంగా పరిశీలించారు. సీసీ రోడ్లు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మెయిన్ రోడ్డులో డ్రైనేజీ మాదిరిగా అంగడి బజార్ లో సైతం పకడ్బందీగా డ్రైనేజీ నిర్మాణం జరిగిందన్నారు.
మున్సిపల్ ప్రజల సౌకర్యం కోసం అందమైన రోడ్లు, డ్రైనేజీ లు నిర్మించడంతో పాటు మెయిన్ రోడ్డు డివైడర్ లో పచ్చని మొక్కల పెంపకం కోసం రూ.1 కోటి 50 లక్షల(Rs. 1 crore 50 lakh) నిధులు ఏర్పాటు చేసి మోత్కూర్ మున్సిపాలిటీని గ్రీనరీ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఫైళ్ల సోమిరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండగొని రామచంద్రు, జిల్లా నాయకులు డా.గుర్రం లక్ష్మీనరసింహ రెడ్డి, అవిశెట్టి అవిలిమల్లు, పన్నాల శ్రీనివాస్ రెడ్డి, పోచం జగన్, పల్లెర్ల వెంకన్న, మందుల సురేష్, మెంట నగేష్, పల్లపు సమ్మయ్య, కూరేళ్ల శ్రీరాములు, బందెల రవి, తదితరులు పాల్గొన్నారు.
