బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే గండ్ర పరామర్శ..

బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే గండ్ర పరామర్శ..
చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కట్కూరి మొగిలి, ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. దీంతో సమాచారం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మొగిలి, ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే మండల కేంద్రంలో అనారోగ్యంతో మృతి చెందిన చిలువేరు తిరుపతి, ఓర్సు కొమురయ్య, ఓర్సు చేరాలు, తూముల నరసింహ రాములు కుటుంబాలను పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో చిట్యాల మాజీ ఎంపిటిసి కట్కూరి పద్మ- నరేందర్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి చిలుకల రాజ కొమురయ్య, యూత్ మండల అధ్యక్షుడు అల్లకొండ కుమార్, టౌన్ అధ్యక్షుడు గంగాధరి రవీందర్, నాయకులు అల్లంరాజు, సర్వ శరత్ కుమార్, క్యాతం మార్కండేయ, చిలుముల రాజమౌళి, నవాబుపేట మాజీ సర్పంచ్ కసిరెడ్డి సాయి సుధా రత్నాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
