AP | చెరుకు గడల అలంకరణలో గోవిందుడు

AP | చెరుకు గడల అలంకరణలో గోవిందుడు

  • ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు
  • తీరంలో మారుమోగుతున్న గోవింద నామ‌స్మ‌ర‌ణ‌

AP | నరసాపురం, ఆంధ్రప్రభ : గోవింద నామాలతో తీరప్రాంతం మారుమోగుతోంది. గోవిందా… గోవిందా.. అంటూ భక్తుల స్వామివారిని ద‌ర్శించుకుంటున్నారు. ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా వాడవాడలా శ్రీవారి ఆలయాలు భక్తులతో కిటకిట లాడుతున్నాయి. ప్రతీ శనివారం విశిష్ట అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడం తో ఆలయాలన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రముఖ ఆలయాలతో పాటు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాల‌లో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

ఉత్సవాలలో భాగంగా నరసాపురం మండలం వేములదీవి వెస్ట్ కాపులకొడప శ్రీ వైభవ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం 26వ రోజు సందర్భంగా స్వామిని చెరకు గడలతో ప్రత్యేకంగా అలంకరించారు. స్వామి విశేష అలంకరణ భక్తులను కనువిందు చేసింది. స్వామిని చూసి భక్త పరవశంతో పులకించిపోయారు. ఈ సందర్భంగా భ‌క్తుల కోసం అన్నదానం చేప‌ట్టారు. ఆలయ కమిటీ భక్తులకు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply