ఆకివీడులో విచిత్ర ఘటన

ఆకివీడులో విచిత్ర ఘటన

  • గుర్రం ముఖాకారంతో గేదె దూడ జననం

ఆకివీడు, ఆంధ్రప్రభ : ఆకివీడు పట్టణంలో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది.గుర్రం మొహంతో ఉన్న దూడకు గేదె జన్మనిచ్చింది. అది చూసిన యజమానితో పాటు స్థానికుల సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వివరాలోకి వెళితే.. ఆదివారం ఉదయం ఆకివీడు పట్టణం కరెంట్ ఆఫీస్ వద్ద ఉప్పల చిన్న అనే వ్యక్తి వద్ద గేదె ప్రసవ నొప్పులతో తెల్లవారుజామున ఇబ్బంది పడుతుందని వెటర్నరీ సిబ్బందికి తెలియజేశారు. ఏడి మల్లేశ్వరరావు అతను సిబ్బంది గేదెను పరీక్షించి, గర్భసంచిలో దూడ అడ్డం తిరిగగా దాదాపు మూడు గంటలు ప్రయాసపడిగా తర్వాత ఆ దూడ బయటకు వచ్చింది.

ఈ నేపద్యంలో ఆ గేదె విచిత్ర దూడకు జన్మనిచ్చింది. గుర్రం మొహంతో ఆ దూడ పుట్టడంతో ఒక్కసారిగా యజమాని, స్థానికులు ఆశ్చర్యపోయారు. దూడ గుర్రం మొహంతో పుట్టడం “వెరీ నోస్” అని అంటారని ఏడి మల్లేశ్వరరావు తెలిపారు. జన్యుపరమైన తేడా వలన ఇలాంటి సంఘటనలు జరుగుతాయని తెలిపారు. దురదృష్టవశాత్తు ఆ దూడ పొట్టలోనే మరణించింది అన్నారు.ముఖ్యంగా ఒకే సెమన్ తరతరాలుగా వాడడం వల్ల ఇలాంటివి జరుగుతాయని పేర్కొన్నారు. అదేవిధంగా గడ్డి మీద కెమికల్స్ జల్లడం వల్ల ఆ గడ్డి తిన్న గేదపై కాకుండా లోపల ఉన్న దూడపై కూడా ఇటువంటి ప్రభావాలు చూపెడతాయని వివరించారు.

రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని, ఒకే సెమెన్ వాడకుండా డాక్టర్లు సలహాలను తప్పకుండా పాటించాలని తెలిపారు. అదేవిధంగా కొంతమంది ప్రైవేటు వ్యక్తులు నకిలీ సెమన్లు ఇంజక్షన్లు అందిస్తున్నారని, వాటి వల్ల కల్తీ జరిగి ఇటువంటి జన్యుపరమైన దూడలు జన్మిస్తున్నాయన్నారు. రైతులు, జంతువుల యజమానులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ డాక్టర్లు సంప్రదించి మాత్రమే సరైన సెమెన్ అందుకుని,పసుజాతిని కాపాడుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply