GO No. 44 | అమలు చేయాలి..

GO No. 44 | అమలు చేయాలి…
- జీఓ నెం.44ను అమలు చేయాలి…
- పురపాలక సంఘ కమిషనర్ కు వినతిపత్రం
- యువ న్యాయవాది అల్లూరి హేమంత్ కుమార్
- షాపింగ్ మాల్స్ సినిమా థియేటర్స్ నందు..
- పార్కింగ్ కి ఎలాంటి నగదు చెల్లింపు అవసరం లేదు
గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ మున్సిపల్ శాఖ పరిధిలో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి విభాగం వారు జారీ చేసిన G.O.MS.No.44, తేదీ: 24-03-2025 ను అమలు చేయాలని హేమంత్ కుమార్ అల్లూరి, యువ న్యాయవాది, సామాజిక కార్యకర్త గుడివాడ మున్సిపల్ పరిధిలోని వాణిజ్య సంస్థలు, మాల్స్, మల్టీప్లెక్సులు, థియేటర్లు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో సదరు ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాలని కోరుతూ గుడివాడ మున్సిపల్ కమిషనర్ సింహాద్రి రమేష్ కు వినతిపత్రం సమర్పించారు.
ఈసందర్భంగా హేమంత్ కుమార్ అల్లూరి మాట్లాడుతూ… ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వాణిజ్య సంస్థలు, సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు, వినోద కేంద్రాల్లో ప్రజలకు ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాల్సి ఉండగా, గుడివాడ మున్సిపల్ పరిధిలోని పలు సంస్థలు దీనిని ఉల్లంఘిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా వినాయక ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్, గుడివాడ లోని సినిమా థియేటర్లు (G3 భాస్కర్ టాకీస్, బొమ్మరిల్లు థియేటర్, G3 థియేటర్స్ సింధూర అండ్ శ్రీ బాలాజీ థియేటర్ A/c DTS), మాల్స్ అండ్ మల్టీప్లెక్సులు (The Next Powered By ABR CINEMAS) లో నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఈ అర్జీని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆంధ్రప్రదేశ్, వడ్డేశ్వరం వారికి సమర్పించడంతో పాటు, సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఇదే అంశంపై ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి న్యాయవాదులు రవితేజ తనుకుల, వెంకటేష్ పట్టం ద్వారా కూడా అర్జీలను పంపారన్నారు. ప్రజల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ ఉత్తర్వుల సమర్థవంతమైన అమలు కోసం సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని హేమంత్ కుమార్ అల్లూరి ఈ సందర్భంగా కోరినట్లు తెలిపారు.
