War Terrorism :   అమెరికాలో వణకు  Andhra Prabha SPL Story

War Terrorism :   అమెరికాలో వణకు  Andhra Prabha SPL Story

నార్కో బోనులో వెనిజులా

పెద్దపిల్లిపై ప్రపంచం ఆగ్రహం

మదురో దంపతుల అరెస్టుకు వ్యతిరేకం

అమెరికా టార్గెట్​  రస్యా, చైనా

సంకట స్థితిలో భారత్​

మెక్కికో..క్యూబా..కొలంబియాపై నార్కో పాచిక

అమెరికా జనంలో అలజడి

తెరమీదకు  వియత్నాం..ఇరాక్​ కథలు

వార్​ టెర్రరిస్టుగా ట్రంప్​ కు కొత్త పేరు

War Terrorism

( ఆంధ్రప్రభ, ఎనాలిసిప్​ డెస్క్​  )

సహజ సంపదలతో సుంపన్న దేశంగా పేరొందిన వెనిజులా .. ఇప్పుడు ఆకలితో అలమటిస్తోంది. తాగటానికి గుక్కెడు వీళ్లు దొరక్క జనం అల్లాడిపోతున్నారు. ఆగర్భ దారిద్చ్యంతో వెనిజుల ప్రజలు పొట్టకూటి కోసం వలస జీవులుగా మారారు. ఈ స్థితికి కారణం.. అధికార దాహంతో రాజకీయపార్టీల కాట్లాట.. దేశ సహజ సంపదల్పి కొల్లగొట్టేందుకు అగ్రరాజ్యాల మధ్య ఆధిపట్య పోరాటం .. ఇందుకు ప్రధాన కారణం. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాల నిరసన గాలికి కొట్టుకు పోతుంటే.. వెనిజులా ప్రజలు విదేశాలకు పారిపోతున్నారు.

War Terrorism  : వెనిజులా విలవిల

తాజాగా   జనవరి 3, 2026న అమెరికా చేపట్టిన “అబ్సల్యూట్ రిజాల్వ్” (Absolute Resolve) అనే భారీ సైనిక ఆపరేషన్  తో వెనిజులా  అధ్యక్షుడు నికోలస్ మదురోను పదవీత్యుచుడయ్యారు. మదురో దంపతులను అమెరికా సైన్యం  బంధించింది.  ఇక  వెనిజులా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. వెనిజులా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది.  2025 చివరి నాటికి దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది, కనీస వేతనం నెలకు కేవలం 1 డాలర్ కు దిగజారింది.

  ప్రజలు తమ ప్రాథమిక అవసరాల కోసం విదేశీ కరెన్సీ (డాలర్లు) లేదా క్రిప్టో కరెన్సీలపై ఆధారపడుతున్నారు.  సుమారు 80% మంది ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు, అందులో 70% మందికి పైగా తీవ్ర పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఆహారం, మందులు, ఇంధనం కొరత కారణంగా జనం అల్లాడుతున్నారు.  మెరుగైన జీవితం కోసం ఇప్పటికే సుమారు 80 లక్షల మంది వెనిజులా వాసులు దేశాన్ని వదిలి వెళ్లిపోయారు. రాజధాని కరాకస్   ఇతర ప్రాంతాలలో ప్రస్తుతం తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఆహారం, నీరు  ఇంధనం కోసం ప్రజలు ఎగబడుతున్నారు. అంతర్జాతీయ సమాజం ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది.

War Terrorism : అమెరికా సైనిక దాడిలో 80 మంది మృతి

వెనిజులా దాడుల్లో కొంతమంది క్యూబా సైనికులు మరణించడంతో ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా  దాడిలో మొత్తం 32 మంది క్యూబా సైనికులు (సైనిక, నిఘా అధికారులు) మృతి చెందినట్టు  క్యూబా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వీరు వెనిజులా ప్రభుత్వం  అభ్యర్థన మేరకు అక్కడ విధులు నిర్వహిస్తున్నారని, అమెరికా దాడులను ధీటుగా ఎదుర్కొంటూ వీర మరణం పొందారని క్యూబా పేర్కొంది. దీనికి సంతాపంగా జనవరి 5, 6 తేదీల్లో క్యూబా రెండు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించింది. ఈ దాడిలో   మొత్తం మరణాల సంఖ్య 80కి పైగా చేరింది.మృతుల్లో సాధారణ పౌరులతో పాటు వెనిజులా భద్రతా దళాల సభ్యులు కూడా ఉన్నారు.

 War Terrorism  : ఆ రెండు దేశాలే టార్గెట్​ ..

వెనిజులాపై జరిగిన ఈ సైనిక దాడి వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్   ఆయన బృందం బహుముఖ వ్యూహాన్ని రచించారు. అమలు చేస్తున్నారు. నికోలస్ మదురోను పదవి నుండి తొలగించి, అమెరికాకు అనుకూల ప్రభుత్వాన్ని  (Regime Change)  ఏర్పాటు చేసి    వెనిజులాలో తన పట్టును బలపరుచుకోవాలని అమెరికా భావిస్తోంది.  ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు కలిగిన వెనిజులాలో  చమురు మౌలిక సదుపాయాలను పునర్నిర్మించి, చమురు ఉత్పత్తిని తిరిగి ప్రారంభించి  అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌ శాసించటం అమెరికా  ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

 మదురో ప్రభుత్వం “నార్కో-టెర్రరిజం” (మాదకద్రవ్యాల ఉగ్రవాదం)కు పాల్పడుతోందని, దీనివల్ల అమెరికాలోకి భారీగా డ్రగ్స్ వస్తున్నాయని అమెరికా ఆరోపించింది. ఈ ముప్పును తొలగించడమే ఈ ఆపరేషన్ ప్రాథమిక ఉద్దేశమని ప్రకటించింది.  వెనిజులాలో ఆర్థిక , రాజకీయ స్థిరత్వాన్ని తీసుకు వచ్చి,  వలసదారుల సంఖ్యను తగ్గించాలని అమెరికా యోచిస్తోంది.   లాటిన్ అమెరికాలో చైనా, రష్యా, ఇరాన్ దేశాల జోక్యాన్ని తగ్గించి, ఈ ప్రాంతంపై తన ఆధిపత్యాన్ని తిరిగి చాటుకోవాలని (మొన్రో సిద్ధాంతం – Monroe Doctrine) అమెరికా తపిస్తోంది.

War Terrorism :  నెక్ట్స్​ టార్గెట్​ దేశాలివే…

War Terrorism

వెనిజులా ఆపరేషన్ సక్సెస్​ తో  అమెరికా  అధ్యక్షుడు ట్రంప్  దృష్టి మరికొన్ని దేశాలపై పడింది. ఈ మేరకు ఆయనే స్వయంగా  సంకేతాలిచ్చారు.  జాతీయ భద్రత దృష్ట్యా గ్రీన్​ ల్యాండ్ (Greenland)  తమ దేశానికి  అత్యంత అవసరమని ట్రంప్  చెబుతున్నారు. అక్కడ చైనా, రష్యాల ఉనికిని బ్లాక్​ (Block)  చేసి,  గ్రీన్​ ల్యాండ్ ను తమ ఆధీనంలోకి తీసుకోవాలన్నది అమెరికా ఆలోచన. మెక్సికో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సరిహద్దు సమస్యల దృష్ట్యా మెక్సికో (Mexico) పై అమెరికా ఒత్తిడి పెంచుతోంది. అక్కడ డ్రగ్ కార్టెల్స్‌పై దాడి చేయడానికి సైన్యాన్ని పంపే ఆలోచనలో ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది.  కొలంబియా Colombia అధ్యక్షుడు గుస్తావో పెట్రోను (Petro) విమర్శిస్తూ, అక్కడ తయారవుతున్న కొకైన్ అమెరికాకు ముప్పుగా మారిందని ట్రంప్ ఆరోపించారు. అక్కడి ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించకపోతే సైనిక చర్య తప్పదని హెచ్చరించారు.  క్యూబా (Cuba)లోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలుతుందని ట్రంప్ జోస్యం చెప్పారు.

 War Terrorism  : ఇది వార్​ టెర్రరిజమే

ఇతర దేశాల అధ్యక్షులను అరెస్టు చేసే అధికారం సాంకేతికంగా చట్టబద్ధంగా అమెరికాకు లేదు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ప్రతి దేశం స్వతంత్రమైనది . సార్వభౌమాధికారం (Sovereignty) ఉంటుంది,  ఒక దేశ చట్టాలు మరొక దేశాధినేతపై చెల్లవు. పదవిలో ఉన్న దేశాధినేతలకు అంతర్జాతీయంగా ‘రాజకీయ రక్షణ’ (Immunity) ఉంటుంది. వారిని వేరే దేశం విచారించడం లేదా బంధించడం చట్టవిరుద్ధం.  తన జాతీయ భద్రతకు ముప్పు కలిగించే వారిని (ఉదాహరణకు నార్కోటిక్స్, ఉగ్రవాదం) విదేశాల్లో ఉన్నా సరే బంధించే హక్కు తనకు ఉందని తన అంతర్గత చట్టాలతో అమెరికా  వాదిస్తుంది. 1989లో పనామా అధ్యక్షుడు మాన్యుయెల్ నోరియెగాను కూడా అమెరికా ఇలాగే అరెస్టు చేసింది.

 అంతర్జాతీయ సమాజం ఈ చర్యను అంగీకరించదు. మెజారిటీ ప్రపంచ దేశాలు ,  ఐక్యరాజ్యసమితి (UN) ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తాయి.  వెనిజులాలో మదురో అరెస్టును రష్యా, చైనా, క్యూబా వంటి దేశాలు “అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన”గా పేర్కొన్నాయి.  ఒక దేశం మరొక దేశాధినేతను బంధించడం మొదలుపెడితే ప్రపంచంలో శాంతి భద్రతలు ఉండవని, ఇది “అడవి చట్టం” (Law of the jungle) వంటిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బలహీన  దేశాలపై అమెరికా  తన సైనిక శక్తిని ఉపయోగించి ఇలాంటి పనులు చేస్తోంది (వెనిజులా, పనామా వలె).  . అంతర్జాతీయ చట్టాల ప్రకారం అమెరికా చేసిన పని తప్పు, (War terrorism)  కానీ “బలవంతుడిదే రాజ్యం” అన్నట్లుగా అమెరికా వ్యవహరిస్తోంది. చాలా మంది అంతర్జాతీయ చట్ట నిపుణులు, ప్రపంచ సంస్థల అభిప్రాయం ప్రకారం, ఈ అరెస్టు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ జరిగింది.

War Terrorism :   సార్వభౌమాధికార ఉల్లంఘన

 ఐక్యరాజ్యసమితి (UN) చార్టర్ ఆర్టికల్ 2(4) ప్రకారం, ఒక దేశం మరొక దేశంపై సైనిక శక్తిని ప్రయోగించటం  లేదా ఆ దేశ రాజకీయ స్వాతంత్ర్యంపై దాడి చేయడం చట్టవిరుద్ధం.వెనిజులపై సైనిక చర్యకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) నుంచి  ఎలాంటి ముందస్తు అనుమతి లేదు.  అంతర్జాతీయ చట్టం ప్రకారం పదవిలో ఉన్న దేశాధినేతలకు ఉండే రక్షణను (Immunity) అమెరికా పట్టించుకోలేదు.  మదురో ప్రభుత్వం “నార్కో-టెర్రరిజం” (మాదకద్రవ్యాల ఉగ్రవాదం)కు పాల్పడుతోందని, దీనివల్ల అమెరికా జాతీయ భద్రతకు ముప్పు ఉందని అమెరికా ఈ చర్యను సమర్థించుకుంటోంది.

  War Terrorism  :  చెరలో మదురో దంపతులు

War Terrorism

మదురో , ఆయన భార్యను న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ ఫెడరల్ కోర్టు (Southern District of New York) లో హాజరుపరిచారు.  జనవరి 5, 2026న వీరిద్దరినీ  కోర్టు ముందు అమెరికా  హాజరు పర్చింది.  నార్కో-టెర్రరిజం కుట్ర, కొకైన్ దిగుమతి కుట్ర, మెషిన్ గన్ల తదితర  విధ్వంసక ఆయుధాలను కలిగి ఉన్నారని తీవ్ర  నేరారోపణలు మోపారు.  ప్రస్తుతం ఈ కేసు విచారణ ప్రారంభ దశలో ఉంది. మదురో తరపు న్యాయవాదులు ఈ అరెస్టు అక్రమమని,  ఆయనకు దేశాధినేతగా రక్షణ ఉంటుందని వాదించారు.

War Terrorism  : అరెస్టు ఓ  కోవర్టు కథే  

ఈ ఆపరేషన్ చాలా వ్యూహాత్మకంగా  వేగంగా జరిగింది,   జనవరి 3 తెల్లవారుజామున అమెరికాకు చెందిన డెల్టా ఫోర్స్ (Delta Force),  సీఐఏ (CIA) బృందాలు కరాకస్‌లోని మదురో నివాసంపై దాడి చేసి   అదుపులోకి తీసుకున్నాయి.  హెలికాప్టర్  ద్వారా సముద్రంలోని  USS ఐవో జిమా (USS Iwo Jima) అనే అమెరికా యుద్ధనౌకకు తరలించారు.

War Terrorism

అక్కడి నుంచి  ప్రత్యేక విమానంలో  న్యూయార్క్‌లోని స్టీవర్ట్ ఎయిర్ నేషనల్ గార్డ్ బేస్‌కు చేర్చి, ఆపై భారీ భద్రత (ఆర్మర్డ్ కాన్వాయ్) మధ్య మాన్‌హట్టన్ కోర్టుకు తీసుకువచ్చారు.  కోర్టుకు వచ్చే సమయంలో మదురో సంకెళ్లతో (handcuffed), తాన్ రంగు ఖైదీ దుస్తుల్లో ఉన్నారని, స్వల్పంగా కుంటుతూ నడిచారని వార్తా సంస్థలు తెలిపాయి.

War Terrorism :  ట్రంప్​ ఫ్యాన్స్​ జోష్​

 అమెరికా అధ్యక్షుడు  ట్రంప్ మద్దతుదారులు  ఈ సైనిక చర్యను  ఒక “చారిత్రక విజయం”గా అభివర్ణిస్తున్నారు. అమెరికా సరిహద్దుల్లోకి డ్రగ్స్ రాకుండా అడ్డుకోవడానికి, కమ్యూనిజాన్ని అంతం చేయడానికి ఇది అవసరమని   భావిస్తున్నారు. “అమెరికా ఫస్ట్” నినాదానికి ఇది నిదర్శనమని   సంబరాలు చేసుకుంటున్నారు.   ఈ సైనిక చర్యతో అమెరికా అధ్యక్షుడు  ట్రంప్ తాను చెప్పింది చేసే “బలమైన నాయకుడు” (Strongman) అనే ఇమేజీని  మరింత బలపరుచుకున్నారు.

ఇది రాబోయే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి పెద్ద అసెట్ అవుతుంది.  అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని   వెనిజులా, క్యూబా సంతతి   మదురో పతనాన్ని కోరుకుంటారు. ఈ ఆపరేషన్ వల్ల ఈ కీలక   ఓటు బ్యాంకు పూర్తిగా రిపబ్లికన్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.   మాదకద్రవ్యాల ముఠాలపై యుద్ధం ప్రకటించడం ద్వారా, అమెరికాలోని “డ్రగ్ సంక్షోభం” (Fentanyl crisis) కు పరిష్కారం చూపుతున్నామని రిపబ్లికన్లు ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చు .  లాటిన్ అమెరికాలో చైనా, రష్యాల ప్రభావానికి చెక్ పెట్టడం ద్వారా అమెరికా గ్లోబల్ డామినెన్స్‌ను కాపాడామని   ప్రచారం చేసుకునే అవకాశం ఉంది.

War Terrorism  :  అంత ఈజీ కాదు

 డెమోక్రాట్లు దీనిని “నిరంకుశ చర్య”గా అభివర్ణిస్తున్నారు. అంతర్జాతీయ అనుమతి లేకుండా చేసిన ఈ దాడి వల్ల ప్రపంచ వ్యాప్తంగా అమెరికా ప్రతిష్ట దెబ్బతింటుందని, ఇది భవిష్యత్తులో ఇతర దేశాలతో సంబంధాలను దెబ్బతీస్తుందని   విమర్శిస్తున్నారు.  యుద్ధ వ్యతిరేక కార్యకర్తలు,  కొందరు పౌరులు ఆందోళన చెందుతున్నారు. అమెరికా మళ్లీ “అంతర్జాతీయ పోలీసు” పాత్ర పోషించడంతో  దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందని, ఇది మరో ‘వియత్నాం’   ‘ఇరాక్’ లాగా మారుతుందేమోనని భయపడుతున్నారు

War Terrorism :  ఇది వెనిజులా పాపమా ?

War Terrorism

గత దశాబ్ద కాలంలో ఈ ప్రాంతంలో రష్యా,  చైనా  తమ పట్టును బాగా పెంచుకున్నాయి.  చైనా ఇప్పుడు లాటిన్ అమెరికాకు రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. బ్రెజిల్, చిలీ, పెరూ వంటి దేశాలకు చైనానే అతిపెద్ద ఎగుమతి మార్కెట్. మౌలిక సదుపాయాలు (రోడ్లు, పోర్టులు), ఇంధనం,   5G టెక్నాలజీలో చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. వెనిజులాకు సుమారు 60 బిలియన్ డాలర్ల అప్పులు ఇచ్చి చమురు వనరులపై పట్టు సాధించింది.  రష్యా ప్రధానంగా సైనిక   వ్యూహాత్మక సంబంధాలపై దృష్టి పెట్టింది. వెనిజులా, క్యూబా, నికరాగ్వా వంటి దేశాలకు రష్యా ప్రధాన ఆయుధ సరఫరాదారు. వెనిజులాకు సుమారు 10 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను విక్రయించింది. అమెరికాకు వ్యతిరేకంగా ఈ దేశాల్లో రష్యా తన సైనిక ఉనికిని చాటుతోంది.

War Terrorism  :  అమెరికా గజగజ

పశ్చిమ అర్ధగోళంలో (Western Hemisphere) బయటి దేశాల జోక్యం ఉండకూడదనేది మోన్రో సిద్ధాంతానికి  (Monroe Doctrine)   అమెరికా పాత పాలసీ. కానీ రష్యా, చైనా  తమ “పెరటిలోకి” (Backyard) రావడం అమెరికాకు  నచ్చడం లేదు.  వెనిజులాలోని చమురు, బొలీవియాలోని లిథియం వంటి కీలక ఖనిజాలు చైనా వశం కావడంతో తమ దేశ భద్రతకు, ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా అమెరికా భావిస్తోంది.

War Terrorism

పనామా కాలువపై చైనా ప్రభావం పెరగడం వల్ల అమెరికా వాణిజ్య మార్గాలకు ఇబ్బంది కలగవచ్చని భయపడుతోంది.  క్యూబా,  వెనిజులాలో చైనా, రష్యాలు తమ నిఘా కేంద్రాలను (Surveillance bases) ఏర్పాటు చేసి అమెరికాపై  నిఘా పెడతాయని ఆందోళన చెందుతోంది.  “అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా విదేశీ శక్తులతో (చైనా, రష్యా) చేతులు కలిపితే ఫలితం ఇలాగే ఉంటుంది” అని లాటిన్​ అమెరికా దేశాలకు అమెరికా ఒక గట్టి సందేశాన్ని పంపింది.

War Terrorism :  భారత్​ సంకట స్థితి

భారతదేశానికి ఒకప్పుడు వెనిజులా అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉండేది (రోజుకు 4 లక్షల బ్యారెళ్ల వరకు). అయితే, అమెరికా ఆంక్షల కారణంగా ఇది గణనీయంగా తగ్గింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వెనిజులా నుండి భారత చమురు దిగుమతులు కేవలం 255 మిలియన్ డాలర్లు మాత్రమే, ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 80% పైగా తక్కువ. 2023-,,24లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 1.17 బిలియన్ డాలర్లుగా ఉంది. భారతదేశం ప్రధానంగా ఔషధాలు (pharmaceuticals), పత్తి మరియు యంత్రాలను వెనిజులాకు ఎగుమతి చేస్తోంది.  భారత ప్రభుత్వ సంస్థ ONGC విదేశ్ లిమిటెడ్ (OVL) వెనిజులాలోని శాన్ క్రిస్టోబల్ చమురు క్షేత్రంలో 40% వాటాను కలిగి ఉంది. సుమారు 500 మిలియన్ డాలర్ల నుండి 1 బిలియన్ డాలర్ల వరకు రావాల్సిన డివిడెండ్లు ఆంక్షల కారణంతో  వెనిజులాలో  బ్రేక్​ పడింది.

War Terrorism  :   డెల్సీ కి అన్నీ సవాశ్లే

జనవరి 3, 2026న అమెరికా  న సైనిక దాడిలో అధ్యక్షుడు  నికోలస్ మదురో అరెస్టుతో , వెనిజులాలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం వెనిజులా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డెల్సీ రోడ్రిగ్జ్ (Delcy Rodríguez) తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు.   మదురో అనుకూల వర్గాలను సమన్వయం చేసుకోవడం, తన నాయకత్వంపై సైన్యం మద్దతును నిలబెట్టుకోవడం ఆమెకు అతిపెద్ద సవాళ్లు. 2024 ఎన్నికల్లో గెలిచినట్లు చెప్పుకుంటున్న ఎడ్ముండో గొంజాలెజ్,   నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియా కొరినా మచాడోలు తననే అధ్యక్షుడిగా ప్రకటించాలని  డిమాండ్ చేస్తున్నారు.  

War Terrorism

దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆహార మరియు చమురు కొరతను ఎదుర్కోవడం తక్షణ సవాలుగా మారింది. ప్రారంభంలో తీవ్రంగా అమెరికాను  వ్యతిరేకించినప్పటికీ, జనవరి 5, 2026 నాటికి ఆమె స్వరం తగ్గించారు. అంతర్జాతీయ చట్టాల పరిధిలో అమెరికాతో కలిసి పనిచేయడానికి సిద్ధమని ఆమె సోషల్ మీడియా ద్వారా ఆహ్వానం పలికారు.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమెకు హెచ్చరిక జారీ చేస్తూ, అమెరికా ప్రయోజనాలకు సహకరించకపోతే మదురో కంటే “పెద్ద మూల్యం” చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

War Terrorism  :  అమెరికా వైపు బేల చూపు

వెనిజులా చమురు నిల్వలపై పూర్తి నియంత్రణ సాధిస్తామని ట్రంప్ ప్రకటించడంతో, ఆమె అమెరికా డిమాండ్లకు తలొగ్గక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చు. రష్యా,  చైనా మదురో అరెస్టును తీవ్రంగా ఖండించాయి . మదురోను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.  మదురో లేని పక్షంలో, రష్యా ,  చైనా తమ భారీ పెట్టుబడులను (ముఖ్యంగా చమురు   అప్పులు) కాపాడుకోవడానికి రోడ్రిగ్జ్ ప్రభుత్వంతో సంబంధాలను కొనసాగించే అవకాశం ఉంది.  

ఒకవేళ రోడ్రిగ్జ్ పూర్తిగా అమెరికా వైపు మొగ్గితే, వెనిజులాపై రష్యా   చైనా తమ పట్టును కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతానికి ఆమె తన అధికారాన్ని కాపాడుకోవడానికి అమెరికాతో “సహకారం” అనే ముసుగులో చర్చలు జరుపుతూనే, పాత మిత్రులు  రష్యా, చైనాల మద్దతును కూడా పొందే ప్రయత్నం చేస్తున్నారు.   అమెరికా నేరుగా రంగంలోకి దిగడంతో ఆమె స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. .

War Terrorism  : పిట్టపోరులో ..పెద  పిల్లులు

ప్రస్తుతం వెనిజులా సింగిల్​ పిట్టగా మారితే.. అమెరికా, రష్యా, చైనా అడ్రరాజ్యాలు పిల్లులుగా మారాయి, ఈ మూడు దేశాల మధ్య ఆధిపత్యం పోరాటంలో వెనిజులా బితుకు బితుకుమంటోంది. ప్రపంచ దేశాలు వ్యతిరేకిస్తున్న సైనిక చర్యతో ఈ పిట్ట పోరులో   అమెరికా  అత్యంత శక్తివంత   మధ్యవర్తిగా,  నియంత్రణాధికారిగా వ్యవహరిస్తోంది.వెనిజులా చమురు నిల్వలను తన అదుపులోకి తీసుకోవడం,  అక్కడ ఒక “స్థిరమైన, అనుకూల” ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అమెరికా లక్ష్యం.  తాత్కాలిక అధ్యక్షురాలు  డెల్సీ రోడ్రిగ్జ్‌పై ఒత్తిడి తెస్తూ, ఆమె తమకు సహకరించకపోతే మదురో కంటే కఠినమైన శిక్ష తప్పదని  హెచ్చరిస్తోంది.

War Terrorism  :  నాలుగో పిల్లి ప్రత్యక్ష్యం

 వెనిజులా సంక్షోభానికి “శాంతియుత  ప్రజాస్వామ్య” పరిష్కారం కనుగొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పెయిన్ తెరమీదకు వచ్చింది.  ఇప్పటికే బ్రెజిల్, ఇటలీ, పోర్చుగల్ వంటి దేశాలతో చర్చిస్తోంది.  అమెరికా చర్యను “ప్రమాదకర  అంశంగా పేర్కొంటూ, ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా చర్చలు జరపాలని చూస్తోంది.  మదురోకు మద్దతుగా నిలుస్తూ, అమెరికా జోక్యాన్ని అంతర్జాతీయ వేదికలపై (UN) రష్యా, చైనా ఎండగడుతున్నాయి.

War Terrorism

వెనిజులాలో తమకు రావాల్సిన వేల కోట్ల రూపాయల అప్పులు, చమురు ప్రాజెక్టులను కాపాడుకోవడానికి ఇవి ప్రయత్నిస్తున్నాయి.  వెనిజులాలో ఒకవైపు మదురో అనుకూల వర్గం (డెల్సీ రోడ్రిగ్జ్), మరో వైపు విపక్షాలు (మరియా కొరినా మచాడో) మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.  ఈ “పిట్ట పోరు”లో ప్రస్తుతం అమెరికానే పైచేయి   కనిపిస్తోంది.  , డెల్సీ రోడ్రిగ్జ్ అమెరికాకు పూర్తిగా తలొగ్గుతారా లేదా రష్యా -చైనాల మద్దతుతో కొత్త వ్యూహం పన్నుతారా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం ఈ వివాదంలో అమెరికా  పెద్ద పిల్లి పాత్రలో తన ప్రయోజనాలను నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉంది.

Leave a Reply