ప్రయాణికులు బేంబేలు

ప్రయాణికులు బేంబేలు

  • జేసీబీ సాయంతో గట్టెక్కిన బస్సు


(నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ) : నంద్యాల జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్నభారీ వర్షాలకు పలు వాగులు, వంకలు(Streams, bends) పొంగిపొర్లుతున్నాయి. నంద్యాల మండలం ఉయ్యాలవాడ మహానంది(Uyyalawada Mahanandi)లో శనివారం తెల్లవారుజాము న భారీ వర్షం కురిసింది. పలుచోట్ల ట్రాఫిక్ కు అంతరాయం తప్పలేదు. నదులు చెరువులు పొంగి నీరు రోడ్లపైకి వస్తున్నాయి.నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం రూపనగుడి గ్రామం వద్ద వరదనీటిలో ఒక ట్రావెల్ బస్సు(Travel Bus) చిక్కుకుంది. కుందూ నది రాకపోకలకు అడ్డంకిగా మారింది. ఉయ్యాలవాడ మండలం గ్రూపునగుడి(Groupnagudi) గ్రామం వద్ద చెరువు నీరంతా రహదారిపైకి చేరుకుంది.

ఆ నీరు కుందూనది వంతెన పైకి చేరుతోంది. కర్నూలు నుంచి జమ్మలమడుగు వెళ్తున్నఈ ప్రైవేట్ ట్రావెల్(Private Travel) బస్సు వరద నీటిలో మధ్యలో చిక్కు కోవటంతో ప్రయాణికులు ఆందోళన చెందారు, కేకలు వేశారు. భయాందోళనకు గురి అయ్యారు. తక్షణమే అధికారుల(Officers)కు గ్రామస్తులు సమాచారం అందించారు ఆ బస్సులో 24 మంది ప్రయాణికులు(Passengers) ఉన్నరు. రూపనుగుడి గ్రామస్తులు, అధికారులు జేసీబీ సహాయంతో మూడు గంటలు కష్టపడి ప్రయాణికులను రక్షించారు.

ఇందులో వృద్దులు చిన్నపిల్లలు ఉండటం విశేషం. ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటికి రావటంతో అధికారులు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కోవెలకుంట్ల- జమ్మలమడుగు(Kovelakuntla- Jammalamadugu) మార్గంలో రాకపోకలకు కూడ అంతరాయం ఉందని ప్రజలెవరు బస్సులపై ప్రయాణాలు, వాహనాల పై ప్రయాణాలు చేయకూడదని అధికారులు తెలుపుతున్నారు. అందులో ప్రయాణిస్తున్నప్రయాణికులు(Passengers) మహిళలు వృద్ధులు చిన్నారులు(Children) గ్రామస్తులకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.