Maoist | వారు లొంగిపోతే…

Maoist | వారు లొంగిపోతే…

  • మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ: డీజీపీ

Maoist | హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ రాష్ట్రంలో 17మంది లొంగిపోతే మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం మావోయిస్టు(Maoist) పార్టీలో తెలంగాణ వాళ్లు 17 మంది ఉన్నారని చెప్పారు. కేంద్ర కమిటీలో నలుగురు, రాష్ట్ర కమిటీలో ఐదుగురు, డివిజన్‌ కమిటీలో ఆరుగురు, అండర్‌గ్రౌండ్‌లో ఒకరితోపాటు మరొకరు ఉన్నారని వెల్లడించారు. వారంతా లొంగిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. ఆపరేషన్‌ కగార్‌ గడువులోపే తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రం అవుతుందని చెప్పారు.

పీఎల్‌జీఏ బెటాలియన్‌లో 400 మందికి పైగా మావోయిస్టులు ఉండేవారని.. ఇప్పుడు వారి సంఖ్య 66కు చేరిందన్నారు డీజీపీ. ఈ సంఖ్యను బట్టిచూస్తే పీఎల్‌జీ పూర్తిగా క్షీణించినట్లు అర్థమవుతోందన్నారు. రాజిరెడ్డి లొంగుబాటుతో ఇంకా ఒకరు మాత్రమే తెలంగాణ రాష్ట్ర కమిటీ వారు మావోల్లో మిగిలారని వివరించారు. సీఎం పిలుపుతో మావోయిస్టులు లొంగిపోతున్నారని డీజీపీ తెలిపారు. డివిజన్ సభ్యులకు రూ.5 లక్షలు(Rs. 5 lakh), ఏరియా సభ్యులకు రూ.4 లక్షలు, మిగతా సభ్యులకు రూ.1 లక్ష రివార్డు అందజేస్తామని భరోసా ఇచ్చారు.

Leave a Reply