Civil Supply | హమాలీ సంఘానికి తీరని లోటు

Civil Supply | హమాలీ సంఘానికి తీరని లోటు
Civil Supply | రామన్నపేట, ఆంధ్రప్రభ : రామన్నపేట మాజీ ఎంపీటీసీ ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు, సివిల్ సప్లై హమాలి యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొరిగే నరసింహ మరణo హమాలీ సంఘానికి తీరనిలోటని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ అన్నారు. ఈ రోజు రామన్నపేటలో మండల కేంద్రంలో జరిగిన గొరిగే నర్సింహ దశదినకర్మలో సిపిఐ ఏఐటీయూసీ నాయకులు పాల్గొని అయన చిత్రపటానికి పూలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్బంగా ఇమ్రాన్ మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబానికి చెందిన నరసింహ గత 30 సంవత్సరాలుగా సివిల్ సప్లై కార్పొరేషన్(Civil Supply Corporation)లో హమాలిగా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ హమాలి హమాలీ సంఘo నాయకునిగా పనిచేస్తూ అనేక పోరాటాలు నిర్వహించారని, రామన్నపేటలో ఎంపీటీసీగా ప్రజలకు సేవలు అందించి అందరి మన్నలను పొందారని ఆయన అన్నారు. గోరిగే నరసింహ మృతికి సంతాపం, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండలం కార్యదర్శి ఉట్కూరి నరసింహ, ఏఐటీయూసీ మండల అధ్యక్షులు బత్తుల సత్యం ప్రధాన కార్యదర్శి శివరాత్రి సమ్మయ్య, సిపిఐ పట్టణ కార్యదర్శి రచ్చ యాదగిరి, సివిల్ సప్లై హమాలి యూనియన్ జిల్లా అధ్యక్షుడు పల్లె శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షుడు పాపగళ్ల శంకరయ్య, గొరిగే శంకరయ్య, పురుగుల రవి, స్వామి, అంజయ్య, పురుగుల శ్రీను, రవి, మహేష్, రమేష్, జీడయ్య, నగేష్, బాలరాజు ఉప్పలయ్య హమాలీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
