Review | శివ‌రాత్రికి మ‌హా ఏర్పాట్లు

Review | శివ‌రాత్రికి మ‌హా ఏర్పాట్లు

  • ఫిబ్రవరి 8వ నుంచి 18 వరకు బ్రహ్మోత్సవాలు
  • వ‌స‌తుల క‌ల్ప‌న‌పై కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసులు సమీక్ష

Review | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానం లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై శనివారం యూనిట్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షకులతో కార్యనిర్వాహణాధికారి యం.శ్రీనివాసులు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి జిల్లా యంత్రాంగ సహాయ, ధర్మకర్తల మండలి సహకారంతో మహాశివరాత్రి ఏర్పాట్లను పకడ్బందీగా చేప‌ట్టాల‌న్నారు.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 8న ప్రారంభమవుతున్నప్పటికీ భక్తులు ముందస్తుగానే క్షేత్రానికి చేరుకునే అవకాశం ఉందన్నారు. గత సంవత్సరం కంటే కూడా ఈ ఏడాది భక్తులరద్దీ పెరిగే అవకాశం ఉందన్నారు. పాదయాత్రతో వచ్చే భక్తుల సౌకర్యార్థం నాగలూటి, పెద్దచెరువు, భీమునికొలను, కైలాసద్వారం, సాక్షిగణపతి మొదలైనచోట్ల చేయాల్సిన ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. భక్తులు సేద తీరేందుకు ఆరుబయలు ప్రదేశాలలో విశాలమైన ప్రాంగణం ఉండేలా పైప్‌పెండాల్స్, షామియానాలు మొదలైన వాటిని వీలైనంత ఎక్కువ విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలన్నారు. వీటివద్ద విద్యుద్దీపాలను ఏర్పాటు చేయాల‌న్నారు. ముఖ్యంగా క్యూలైన్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలన్నారు.

Review

తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై నిర్ల‌క్ష్యం చేయొద్ద‌న్నారు. పార్కింగు ఏర్పాట్లు, సామాన్లు భద్రపరుచుగది, ట్రాఫిక్ నియంత్రణ మొదలైన అంశాలపై ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలన్నారు. అదనపు ప్రదేశాలలో పార్కింగ్ ఏర్పాట్లు ఉండాలన్నారు. పార్కింగ్ ప్రదేశాల వివరాలు స్పష్టంగా తెలిసేవిధంగా సూచికబోర్డులు అధికసంఖ్యలో ఉండాలన్నారు. అదేవిధంగా పాతాళగంగలో అన్ని ఏర్పాట్లను చేయాలన్నారు. భక్తులరద్దీకనుగుణంగా అన్నప్రసాదవితరణ ఏర్పాట్లు ఉండాలన్నారు. క్షేత్రపరిధిలో అన్నదానం చేసే స్వచ్ఛందసేవాసంస్థలకు దేవస్థానం పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ సారి తగినన్నీ లడ్డు ప్రసాదాలను సిద్ధం చేసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రస్తుతం వున్న కౌంటర్లకు అదనంగా మరో 20 లడ్డుకౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. మొత్తం 30 లడ్డు ప్రసాదాల కౌంటర్లు అందుబాటులో ఉంచాలన్నారు.

Leave a Reply