Tirumala | తిరుమలలో అపచారం

Tirumala | తిరుమలలో అపచారం
గోవిందరాజస్వామి ఆలయగోపురం ఎక్కిన మందుబాబు
Tirumala | తిరుమల, ఆంధ్రప్రభ : తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం (Govindarajaswamy Temple) వద్ద మద్యం మత్తులో ఓ భక్తుడు గోపురంపైకి ఎక్కి హంగామా సృష్టించాడు. మద్యం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ గంటల తరబడి అల్లరి చేయడంతో ఆలయ పరిసరాల్లో భక్తులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న తిరుపతి ఈస్ట్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది సహకారంతో సుమారు 3 గంటల పాటు శ్రమించి ఆ వ్యక్తిని గోపురం నుంచి కిందికి దించారు. అనంతరం మద్యం మత్తులో ఉన్న ఆ భక్తుడిని తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు (Tirupati East Police Station) తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటన ఆలయ పరిసరాల్లో కలకలం రేపింది. భక్తులు ఆలయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాను మద్యం కోసమే శ్రీగోవిందరాజస్వామి ఆలయ గోపురం (Temple dome) పైకి ఎక్కానని నిందితుడు చెప్తున్నాడు. అంతేకాకుండా గోపురంపై ఉన్న రెండు కలశాలను కూడా నిందితుడు ధ్వంసం చేశాడు. అందులోనూ ఏకాంత సేవ అనంతరం గేట్లు మూసిన తరువాత లోపలికి అతను ప్రవేశించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

