Rangasthalam 2 | చరణ్, సుక్కు.. ప్రాజెక్ట్ తెర వెనుక ఏం జరుగుతోంది..?

Rangasthalam 2 | చరణ్, సుక్కు.. ప్రాజెక్ట్ తెర వెనుక ఏం జరుగుతోంది..?
ఆంధ్రప్రభ వెడ్ డెస్క్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటీవ్ జీనియస్ సుకుమార్(Creative Genius Sukumar).. ఈ ఇద్దరి కాంబోలో రంగస్థలం సినిమా రూపొందడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడం తెలిసిందే. ఇంకా చెప్పాలంటే.. చరణ్ లోని పూర్తి స్థాయి నటుడ్ని బయటకు తీసింది సుకుమారే. అందుకనే.. చరణ్ కు సుకుమార్ అంటే స్పెషల్(Sukumar is special to Charan). వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయాలి అనుకున్నారు. అనుకోవడమే కాదు.. ఎప్పుడో అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఆతర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే.. చరణ్ కోసం సుకుమార్ పక్కా ప్లాన్ రెడీ(A definite plan is ready) చేశాడని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. సుక్కు ప్లాన్ ఏంటి..? ఈ సినిమా సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు..?
Rangasthalam 2 | రంగస్థలం 2 నిజమా..

చరణ్ కెరీర్లో ఈ సినిమా 17వ సినిమా. రంగస్థలం సినిమాలో చరణ్(Charan in the movie Rangasthalam) ను కొత్తగా చూపించడం.. పైగా అది బ్లాక్ బస్టర్ సాధించడంతో.. ఈసారి చరణ్ ను సుకుమార్ ఎలా చూపించబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. రంగస్థలం 2 చేయనున్నారని వార్తలు వచ్చాయి. కాదు.. కాదు.. ఈసారి చరణ్ ను స్టైలీష్(This time Charan is stylish) గా చూపించబోతున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. గత కొన్ని రోజులుగా సుకుమార్ తన టీమ్ తో బ్యాంకాక్ లో కథ పై కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఎటువంటి కథతో సినిమా చేయబోతున్నారు..? అనేది బయటకు రాలేదు కానీ.. స్క్రిప్ట్ అయితే లాక్(Script if locked) అయ్యిందని తెలిసింది.
Rangasthalam 2 | చరణ్ సరికొత్త నిర్ణయం..

ఇంతకీ.. ఈ క్రేజీ మూవీని ఎప్పుడు పట్టాలెక్కిస్తారంటే.. జూన్ లో స్టార్ట్(Start in June) చేస్తారని తెలుస్తోంది. అయితే.. ఈ సినిమా గురించి కొత్తగా వినిపిస్తోన్నమాట ఏంటంటే.. రామ్ చరణ్ సంవత్సరం లోపే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలి అనుకుంటున్నారట. సంవత్సరం కంటే ఎక్కువ టైమ్ ఒక సినిమాకి ఇవ్వకూడదని చరణ్ నిర్ణయం తీసుకున్నారట. గేమ్ ఛేంజర్ సినిమాకి(Game Changer movie) ఎక్కువ టైమ్ కేటాయించడం వలన చాలా టైమ్ వేస్ట్ అయ్యిందని ఈ నిర్ణయం తీసుకున్నాడని ఇండస్ట్రీలో వినిపస్తోంది. ఇదే.. నిజమైతే చరణ్, సుకుమార్ కాంబో మూవీ నెక్ట్స్ ఇయర్ ఆగస్ట్(Movie next year August) కు రిలీజయ్యే ఛాన్సుంది. మరి.. ఏం జరగనుందో చూడాలి.

