Sandeep Reddy | అంచనాలు పెంచేసిన స్పిరిట్ లుక్

Sandeep Reddy | అంచనాలు పెంచేసిన స్పిరిట్ లుక్

Sandeep Reddy | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.. ఈ ఇద్దరి క్రేజీ కాంబోలో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ స్పిరిట్(A huge action entertainer spirit). ఈ సినిమా నుంచి ఆమధ్య రిలీజ్ చేసిన ఆడియోకు అదిరింది అనే రెస్పాన్స్ వచ్చింది. ఇంకా చెప్పాలంటే.. అంచనాలను మరింతగా పెంచేసింది. ఇప్పుడు ఈ క్రేజీ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇంతకీ.. ఈ లుక్ కు వచ్చిన ఫీడ్ బ్యాక్ ఏంటి..? ఈ భారీ, క్రేజీ మూవీ థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు..?

Sandeep Reddy | సరికొత్త ప్రభాస్..

Sandeep Reddy

స్పిరిట్ మూవీ నుంచి న్యూయర్ కి ఫస్ట్ లుక్(First look at New Year) వస్తుందని.. గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు ప్రభాస్ ను చూడని విధంగా ఈ పోస్టర్ లో చూపించారు. ఒళ్లంతా కమిలిపోయిన గాయాలతో ప్రభాస్ ఉంటే.. ఆయన ముందు త్రిప్తి దిమ్రీ నిలబడి ఉంది. రా అండ్ రస్టిక్(Raw and rustic) గా ఉన్న ఈ పోస్టర్ సినిమా పై మరింతగా అంచనాలు పెంచేసింది. ఈ పోస్టర్ ను బట్టి స్పిరిట్ లో హైవోల్టేజ్ యాక్షన్ చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది.

Sandeep Reddy | ఆజానుబాహుడు..

Sandeep Reddy

ఇండియన్ సినిమా ఆజానుబాహుడు.. మీ ఆజానుబాహుడు చూడండి.. హ్యాపీ న్యూయర్ అంటూ సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించబోతున్నాడు. అయితే.. రిమాండ్ ఖైదీగా ప్రభాస్ జైలుకు వెళ్లాల్సివస్తుంది. అప్పుడు జైలర్ గా ఉన్న ప్రకాష్ రాజ్ కీ, ప్రభాస్ కీ మధ్య జరిగిన సంభాషణను(Conversation) ఆడియో రూపంలో ఆమధ్య రిలీజ్ చేశారు. ఆ శాంపిల్ ఆడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ పవర్ ఫుల్ పోలీస్ స్టోరీలో మాఫియా సామ్రాజ్యాన్ని కూడా చూపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

Sandeep Reddy | నాన్ స్టాప్ గా స్పిరిట్..

Sandeep Reddy

ఈ సినిమా ఎప్పుడో సెట్స్ పైకి రావాలి కానీ.. ప్రభాస్ బిజీగా ఉండడం వలన కుదరలేదు. యానిమల్ రిలీజ్(Animal Release) తర్వాత నుంచి సందీప్ ప్రభాస్ డేట్స్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు ఇటీవల స్పిరిట్ సెట్స్ పైకి వచ్చింది. ఎలాంటి బ్రేక్స్ లేకుండా నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఓబరాయ్(Bollywood actor Vivek Oberoi), సీనియర్ నటి కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు. వరల్డ్ వైడ్ గా ఈ భారీ, క్రేజీ మూవీని తొమ్మిది భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ.. ఈ సినిమా ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందంటే.. నెక్ట్స్ ఇయర్ సంక్రాంతి లేదా సమ్మర్ లో రిలీజ్ కానుందని సమాచారం. మరి.. ప్రభాస్, సందీప్ కలిసి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.

CLICK HERE TO READ టాక్సిక్ నయన్ లుక్ అదిరింది..

CLICK HERE TO READ MORE

Leave a Reply