Delhi | అమరావతికి చట్టబద్ధతపై చర్చ

Delhi | అమరావతికి చట్టబద్ధతపై చర్చ

Delhi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన అంశాలపై చర్చలు జరిగాయి.

ప్రధానంగా రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు సమాచారం. అమరావతిని రాజధానిగా స్థిరీకరిస్తూ, దానికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో, రాబోయే బడ్జెట్ రెండో దశ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టాలని అమిత్ షాను ముఖ్యమంత్రి కోరినట్లు తెలుస్తోంది.

Leave a Reply