Power line | ఆంధ్రప్రభ కథనానికి స్పందన

Power line | ఆంధ్రప్రభ కథనానికి స్పందన
- వంగిన విద్యుత్ స్తంభ తొలగించి నూతన స్తంభం ఏర్పాటు
Power line | జైనూర్ /సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు )మండలంలోని బూర్నూర్ గ్రామపంచాయతీ సమీపంలోని విద్యుత్ లైన్(Power line) స్తంభం వంగిపోవడంతో ప్రమాదం పొంచి ఉందని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులకు విన్నపించిన విషయం ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితమైంది.
వంగిన స్తంభంతో పొంచి ఉన్న ప్రమాదం శీర్షిక ప్రచురణ కాగా మండల అధికారులు విద్యుత్ శాఖ(electricity department) అధికారులు స్పందించి బుధవారం వందిన స్తంభాన్ని తొలగించి నూతన స్తంభం ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకున్నారు. గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణికి విన్నపించగా కార్యదర్శి ఎంపిఓ ప్రమోద్ కు చెప్పడంతో ఈ విషయం ఎంపీడీవో కృష్ణారావు, ఎంపీ ఓ ప్రమోదులు విద్యుత్ శాఖ అధికారులకు మాట్లాడి వంగిన స్తంభాన్ని తొలగించి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకున్నందుకు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
