NTR assurance | ముందే వచ్చిన వేడుకలు

NTR assurance | ముందే వచ్చిన వేడుకలు

  • ఇంటింటికీ పింఛన్లు అందజేత
  • సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

NTR assurance | పాయకాపురం, ఆంధ్రప్రభ : ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్న నూతన సంవత్సర వేడుకలు రాష్ట్రంలో ఒకరోజు ముందుగానే వచ్చాయి. ప్రభుత్వం ప్రతినెలా ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పింఛ‌న్ నెలకి ఒకరోజు ముందుగానే రావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 64వ డివిజన్ కండ్రిక సుబ్బారెడ్డి స్కూల్, రామాలయం గుడి పరిసర ప్రాంతాల్లో, 61వ డివిజన్ దేవినేని గాంధీపురం గంగానమ్మ గుడి వద్ద ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి వృద్ధాప్య, వితంతు, వికలాంగ, ఆరోగ్య నిమిత్తం అందించే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు టీడీపీ అధ్యక్షులు కె. రవికుమార్, ఆకుల సూర్యప్రకాష్‌తో కలసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ.. ఒకటో తారీఖు వచ్చిందంటే పేదల ఇళ్లలో పండుగ వాతావరణం కనిపిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్‌ల పంపిణీ వ్యవస్థను మరింత మానవీయంగా, బాధ్యతాయుతంగా అమలు చేస్తున్నామని అన్నారు. ఉదయం 6 గంటల నుంచే లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్‌లు అందజేస్తున్నామన్నారు.

NTR assurance

ఈ కార్యక్రమాలలో 64వ డివిజన్ అధ్యక్షుడు కాకొల్లు రవికుమార్, 61వ డివిజన్ అధ్యక్షుడు ఆకుల సూర్య ప్రకాష్, సురవరపు నాగరాజు, సెంట్రల్ నియోజకవర్గ పరిశీలకుడు దేవతోటి నాగరాజు,బుదాల సురేష్, కంచేటి నాగరాజు,పలగాని శివ భాగ్యలక్ష్మి,ప్రధాన కార్యదర్శి ఎస్. కె. బాబు,కోమరి రాజేష్,61వ డివిజన్ ఇంచార్జ్ దాసరి దుర్గారావుఉదయ్ శ్రీ,పసుపులేటి వీరాస్వామి,కోటేశ్వరి, సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు ప్రతినెలా ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణి కార్యక్రమం 58వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ పిరియా జగదాంబ ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జ్ పిరియా సోమేశ్వరరావు, అధ్యక్షుడు కూర్మపు దుర్గారావు, ప్రధాన కార్యదర్శి మల్లంపాటి రవికుమార్, క్లస్టర్ ఇంచార్జ్ సుర్విపల్లి అమర్ నాథ్ గౌడ్, బూత్ ఇంచార్జ్ లు షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply