N.M.D. Farooq | పేదలకు ఎన్టీఆర్ భరోసా..

N.M.D. Farooq | పేదలకు ఎన్టీఆర్ భరోసా..

  • ల‌బ్ధిదారుల‌కు పింఛన్ల పంపిణీ
  • మంత్రి ఎన్ఎండీ ఫరూక్

N.M.D. Farooq | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ సామాజిక పింఛ‌న్ల పంపిణీతో లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నామని రాష్ట్ర మైనార్టీ న్యాయ శాఖ మంత్రి ఎన్ ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని రెండవ, 40 వార్డులలో లబ్ధిదారుకు స్వయంగా ఇంటింటికీ వెళ్లి పింఛన్‌ను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పింఛన్ పంపిణీ చేసినప్పుడు లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం కనిపించిందన్నారు. ఈ 2025 సంవత్సరం ఈరోజుతో అయిపోతుందని రేపు నూతన సంవత్సరం 2026లోకి అడుగుపెడుతున్నతరుణంలో ప్రతీ ఇంటా ఒక పండగ వాతావరణం నెలకొనాలనే ఉద్దేశంతో సీఎం చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు ఒక్కరోజు ముందుగానే పింఛన్ పంపిణీ చేయడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్, 2వ‌ వార్డ్ టీడీపీ నాయకులు మహబూబ్ జెలాని, పుంగ జాకిర్, నబిరసూల్, కలామ్ ,ఖాజా .కొమ్మ శ్రీహరి, కరీం, జహంగీర్ మహబాషా ,ఫరూక్ , క్లస్టర్ ఇన్‌చార్జ్ కామిని మల్లికార్జున, రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు, మాజీ కౌన్సిలర్ మిద్దె ఉసేని, అక్బర్ బాషా, 4 వార్డు కౌన్సిలర్ తబ్రేజ్, జాకిర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply