ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో..

ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో..
ఒంగోలు బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న “ఒక రాష్ట్రం ఒక పరిశుభ్రత లక్ష్యం” కార్యక్రమంలో భాగంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద జరిగిన మున్సిపాలిటీ ఆపరేషన్ క్లీన్ స్విప్ కార్యక్రమంలో సంతనూతలపాడు శాసన సభ్యులు బీఎన్ విజయకుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎస్ ఎన్ పాడు శాసన సభ్యులు పారిశుద్ధ్య పనులను చేపట్టారు. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత అని సందర్భంగా జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
