Attacks | నిరసన ర్యాలీ..

Attacks | నిరసన ర్యాలీ..

  • బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు స‌రికాదు
  • హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళ‌న‌

Attacks | గాంధారి, ఆంధ్రప్రభ : బంగ్లాదేశ్‌లో హిందువుల పైన జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ రోజు గాంధారి మండల కేంద్రంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ(Protest rally)ని నిర్వహించారు. మండల కేంద్రంలోని శివాజీ చౌరస్తా నుంచి బయలుదేరిన హిందూ సంఘాల సభ్యులు ప్రధాన వీధుల గుండా ర్యాలీని నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్‌(Bangladesh)లో మైనార్టీగా ఉన్న హిందువులపై దాడులు చేయడంతో పాటు, అమాయకులైన వారిని చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే హిందువులపై దాడులు జరిగితే సహించేది లేదని, హిందువు(Hindu)లందరూ ఐక్యంగా ఉండి, మతోన్మాద శక్తులను ఎదుర్కోవాలని హిందూ సంఘాల సభ్యులు అన్నారు. కార్యక్రమంలో శివదత్త సేవాసమితి సభ్యులు, అయ్యప్ప సేవా సమితి సభ్యులతో పాటు, బీజేపీ నాయకులు, యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply