చేపవలలో చిక్కుకొని వ్యక్తి మృతి

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : చెరువులో చేపల కోసం వేసిన వలలో చిక్కుకొని ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన జుక్కల్ మండలంలోని లొంగన్ గ్రామంలో చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం,గ్రామస్తులు కథనం ప్రకారం లొంగన్ గ్రామానికి చెందిన మారుతి ముదిరాజ్ (45)ఉదయం స్నానం కోసం గ్రామం పక్కలో గల చెరువులో వెళ్లి స్నానం చేసే క్రమంలో చేపల కోసం వేసిన వలలో చిక్కుకొని బయట వేల్లలేక మృతి చెందడం జరిగిందని తెలిపారు.

చెరువు కట్టపై అతని చెప్పులు,బట్టలు ఉండటంతో అతనిని ముదిరాజ్ మారుతి గుర్తించిన గ్రామస్తులు,బంధువులు పోలీసులకు సమాచారం అందించగా,పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.గ్రామస్తులు సహకారంతో శవాన్ని బయట తీయడం జరిగిందని,అన్ని కోణంలో దర్యాప్తు చేస్తున్నామని జుక్కల్ పోలీసులు తెలిపారు.ఈ సంఘటనతో లొంగన్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.