Bangla Mob Attack : రాక్ సింగర్ జేమ్స్ కు షాక్ AndhraPrabha News
Bangla Mob Attack : రాక్ సింగర్ జేమ్స్ కు షాక్ AndhraPrabha News
బంగ్లాదేశ్‌లో మూక దాడి
ప్రతిఘటించిన విద్యార్థులు
25 మందికి గామాలు
ప్రదర్శన నిలిపివేత తస్లీమా నస్రీన్ ఆగ్రహం
( ఆంధ్రప్రభ, కోల్‌కతా)
బంగ్లాదేశ్ ఇస్లామిక్ మూకలు (Bangla Mod Attack) వీధులను చెలరేగిపోతున్నాయి. భయోత్పాతం సృష్టిస్తున్నాయి. ఛాయానౌత్, ఉడిచి సాంస్కృతిక సంస్థలు, కళాకారులు, జర్నలిస్టులు వార్తాపత్రికల్ని వదలటం లేదు. మూకల దాడికి అవధి లేదు. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ మూకలను నియంత్రించడంలో విఫలమైంది.

తాజాగా బంగ్లాదేశ్‌లో కళాకారులు, ప్రదర్శకులు సాంస్కృతిక సంస్థలపై దాడులు పెరిగిన నేపథ్యంలో, ఢాకాకు 120 కిలోమీటర్ల దూరంలోని ఫరీద్‌పూర్‌లో (Fareedpur) ప్రముఖ రాక్ సింగర్ జేమ్స్ (Rock Singer James) ప్రదర్శనపై మూకలు దాడి చేశాయి.

స్వైర విహారం చేశాయి. కర్రలతో దాడులకు దిగాయి. ఫలితంగా 25 మంది పైగా బంగ్లాదేశీయులు గాయపడ్డారు ఫరీద్‌పూర్‌లో పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం రాత్రి 9:00 గంటలకు ఈ పాప్ సింగర్ జేమ్స్ కచేరీపై అల్లరి మూకలు దాడి చేశారు. జనంపై ఇటుకలు , రాళ్ల వర్షం కురిపించారు. విద్యాసంస్థ విద్యార్థులు ఈ దాడిని ప్రతిఘటించారు. ఈ స్థితిలో స్థానిక అధికారులు స్పందించారు. జేమ్స్ కచేరీని (Programme Stoped) రద్దు చేయించారు.

Bangla Mob Attack
ఈ మూక దాడిపై రచయిత్రి తస్లిమా నస్రీన్ (Tasleema Nasreen) తీవ్రంగా ఖండించారు. బంగ్లాదేశ్‌లో పేట్రేగుతున్న సంస్కృతిని తీవ్రంగా విమర్శించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఆమె ఇలా అన్నారు, “సాంస్కృతిక కేంద్రం ఛాయానౌత్ కాలి బూడిదైంది. సంగీతం, థియేటర్, నృత్యం, పారాయణం జానపద సంస్కృతిని ప్రోత్సహించడం ద్వారా లౌకిక , ప్రగతిశీల చైతన్యాన్ని పెంచేందుకు నిర్మించిన ఉడిచి అనే సంస్థ కూడా బూడిదైంది. నేడు, జిహాదీలు ప్రఖ్యాత గాయకుడు జేమ్స్ ప్రదర్శనకు అనుమతించలేదు.”
Bangla Mob Attack
“కొన్ని రోజుల కిందట , సిరాజ్ అలీ ఖాన్ (Siraj Ali Khan) ఢాకాకు వచ్చాడు. అతను ప్రపంచ ప్రఖ్యాత మాస్ట్రో ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ కుమారుడు. అలీ అక్బర్ ఖాన్ మనవడు. సిరాజ్ అలీ ఖాన్ స్వయంగా మైహార్ ఘరానా విశిష్ట కళాకారుడు. కళాకారులు, సంగీతం సాంస్కృతిక సంస్థలు సురక్షితంగా ఉండే వరకు తాను మళ్ళీ బంగ్లాదేశ్‌కు రానని చెప్పి ఢాకాలో ఎటువంటి కార్యక్రమాన్ని నిర్వహించకుండానే భారతదేశానికి తిరిగి వచ్చాడు” అని నస్రీన్ జోడించారు.

Bangla Mob Attackబహిష్కృత రచయిత తస్లీమా మాట్లాడుతూ, “రెండు రోజుల కిందట , ఉస్తాద్ రషీద్ ఖాన్ కుమారుడు అర్మాన్ ఖాన్ కూడా ఢాకా ఆహ్వానాన్ని తిరస్కరించాడు. సంగీతాన్ని ద్వేషించే జిహాదీలు నివసించే బంగ్లాదేశ్‌లో అడుగు పెట్టాలని తాను కోరుకోవడం లేదని అతను స్పష్టం చేశాడు.

” జేమ్స్ ( James) ఒక బంగ్లాదేశ్ గాయకుడు (Bangladesh Singer) -గేయ రచయిత, గిటారిస్ట్ స్వరకర్త. అతను ‘నగర్ బౌల్’ అనే రాక్ బ్యాండ్‌కు ప్రధాన గాయకుడు, పాటల రచయిత గిటారిస్ట్. ఆయన ‘గ్యాంగ్ స్టర్’ (Gangstar) చిత్రంలోని ‘భీగీ భీగీ’ (Bhigi Bhigi) ‘లైఫ్ ఇన్ ఎ మెట్రో’ చిత్రంలోని ‘అల్విడా’ (Alvida) వంటి అనేక హిట్ హిందీ సినిమా పాటలను పాడారు. ఆయన బంగ్లాదేశ్‌లో బాగా ప్రాచుర్యం పొందారు ఆయన కచేరీపై జరిగిన దాడి బంగ్లాదేశ్‌లో రాడికల్ ఆగడాలు ఎంతగా మితిమీరిపోయాయో అర్థమవుతోంది.
ALSO READ : Bangla Tense : తారిక్ రీ ఎంట్రీ ..! Andhra Prabha Real News
