Mangalagiri | శ్మశాన వాటికల ఆధునికీకరణ
Mangalagiri | శ్మశాన వాటికల ఆధునికీకరణ
- లోకేష్ సొంత నిధులతో వసతులు
- ఆత్మకూరులో ప్రారంభించిన నాయకులు
Mangalagiri | మంగళగిరి, ఆంధ్రప్రభ : మంగళగిరి నియోజకవర్గంలో శ్మశాన వాటికలను పూర్తి స్థాయిలో ఆధునికీకరించడంతో పాటు అవసరమైన వసతులు కల్పించేందుకు మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో మంగళగిరి మండలం ఆత్మకూరులో మూడున్నర ఎకరాల్లో ఆధునిక వసతులతో నిర్మించిన ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మాల, మాదిగ శ్మశాన వాటికలను స్థానిక కూటమి నాయకులు బుధవారం ప్రారంభించారు. శ్మశాన వాటికలో ప్రహరీ, ప్రార్థన గది, విశ్రాంతి గదులు, శ్మశానం లోపల వరకు సీసీ రోడ్డు, పార్కింగ్, నీటి సదుపాయం, మృతుల బంధువులు స్నానం ఆచరించడానికి స్నానపు గదులు, సేద తీరడానికి సిమెంట్ బల్లలు, మరుగుదొడ్లు, పచ్చని గార్డెన్ నిర్మించారు.
ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని శ్మశాన వాటికి ఆహ్లాదభరితంగా అభివృద్ధి చేసినందుకు మంత్రి నారా లోకేష్‌కు రుణపడి ఉంటామని గ్రామ ప్రజలు తెలిపారు. ఈ సందర్భంగా నందం అబద్దయ్య మాట్లాడుతూ.. స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని శ్మశానవాటికలను ఆధునికంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల విశ్వాసానికి తగిన విధంగా మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ కట్టుబడి పనిచేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజల అవసరాలను గుర్తించి వారి సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యతనిస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ విభాగ నాయకులు కొడాలి విజయ్, ఏపీఐఐసీ డైరెక్టర్ కనికళ్ళ చిరంజీవి, మంగళగిరి మండల పార్టీ అధ్యక్షులు పల్లబోతుల శ్రీనివాసరావు, పార్టీ మండల ఉపాధ్యక్షులు కొమ్మా సుకుమార్, మంగళగిరి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఎర్రగుంట్ల భాగ్యరావు, గుంటూరు పార్లమెంట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు వేమూరి మైనర్ బాబు, తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు తాటి వెంకటరావు, గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు కట్టా కృష్ణ, కొమ్మా లవ్ కుమార్, జొన్నకూటి శ్రీనివాసరావు, మాన్యం సుబ్బారావు, సీపీఐ నాయకులు జాలాది జాన్ బాబు, పంతగాని మరి దాసుగారు, కాంట్రాక్టర్ కిషోర్, లూధరన్ సంఘం పాస్టర్ జొన్నకూటి యేసు రత్నం, నియోజకవర్గ పాస్టర్లు పాస్టర్ తిమోతి, రవిప్రకాష్ కుల పెద్దలు జాలాది రత్నం, జాలాది విజయేంద్ర రావు, ధారా గాబ్రియేలు, వేమూరి ఫ్రాన్సిస్, ఎర్రమాల అహరోన్, జంగం బాపయ్య, కొమ్మా జ్యోతి రాజు, సభ్యులు జ్యోతుల అజయ్, జాలాది రాజశేఖర్, వేమూరి నాగరాజు, వేమూరి రాజేష్, ఆర్సీఎం సంఘ పెద్దలు కట్టె పోగు రాంబాబు, బండపల్లి బాపయ్య, పులివర్తి శేషయ్య, పులివర్తి మరియదాసు, కొండమీద సుబ్బారావు, తదితర గ్రామస్తులు వివిధ సంఘాల పాస్టర్లు పాల్గొని జయప్రదం చేశారు.
