Kakani | జీవితం స్ఫూర్తిదాయం..
Kakani | జీవితం స్ఫూర్తిదాయం..
- జై ఆంధ్రకు ఊపిరినిచ్చారు..
- హోం శాఖ మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు
- విజయవాడలో ఘనంగా కాకాని 53వ వర్ధంతి వేడుకలు
Kakani | ఆంధ్రప్రభ విజయవాడ : నాటి జై ఆంధ్ర ఉద్యమానికి కాకాని వెంకటరత్నం ఊపిరి పోసారని హోం శాఖ మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు కాకాని వెంకటరత్నం 53వ వర్ధంతి సందర్భంగా నగరంలోని బెంజ్ సర్కిల్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మాజీ మంత్రి వసంత నాగేశ్వరావు, కాకాని ఆశయ సాధన సమితి అధ్యక్షుడు డాక్టర్ కాకాని తరుణ్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ.. ఆనాటి జై ఆంధ్ర ఉద్యమంలో కాకాని వెంకటరత్నం పోషించిన పాత్ర, దేశంలోనే ఒక మైలురాయిగా నిలిచిందని, ఆ ఉద్యమంతోనే ఆంధ్ర రాష్ట్రంలో వీర కాకానిగా పిలవబడుతున్న వెంకటరత్నంకు వారి ఆధ్వర్యంలోనే వీరవసంత అనే బిరుదు రావడం ఎంతో సంతోషకరమన్నారు. నేటి రాజకీయ నాయకులకు కాకాని జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమని పిలుపునిచ్చారు.

కాకాని ఆశయ సాధన సమితి అధ్యక్షుడు డాక్టర్ కాకాని తరుణ్ మాట్లాడుతూ… 2018 ప్రభుత్వ హయాంలో నాటి నాయకులు బెంజ్ సర్కిల్లోని కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని తొలగించి, తదుపరి చర్యగా కృష్ణా నది తీరాన స్మారకవనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు, ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిసారించి కృష్ణానది తీరాన స్మృతివనం ఏర్పాటు చేయాలని అప్పుడే మన స్వతంత్ర సమరయోధులకు మనం ఇచ్చే నిజమైన గౌరవ పురస్కారమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ చైల్డ్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ ఏవీ సూర్యనారాయణరాజు, బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు, ఎంజి రంగా ట్రస్ట్ చైర్మన్ గోగినేని ధనశేఖర్ మరియు ప్రముఖ ఎన్నారై అక్కినేని ఆనంద్ , సుధా, వేమూరి నాగేశ్వరరావు, ప్రముఖ హైకోర్టు న్యాయవాది ముళ్లపూడి సత్యనారాయణ, ఆకునూరు స్వగ్రామంలోని కాకాని కుటుంబ సభ్యులు అభిమానులు… ప్రముఖ ఐపీఎల్ క్రికెటర్, స్టార్ మా కామెంటరీ దొడ్డపునేని కళ్యాణ్ కృష్ణ, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుల అసోసియేషన్ కార్యదర్శి మోతుకురి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
