Kandhamal Encounter | ముగ్గురు మావోయిస్టులు మృతి

Kandhamal Encounter | ముగ్గురు మావోయిస్టులు మృతి

Kandhamal Encounter | ఒడిస్సా, ఆంధ్ర‌ప్ర‌భ : ఒడిస్సాలో మావోయిస్టు కార్యకలాపాలపై పోలీసులు జోరుగా కొనసాగిస్తున్న ఆపరేషన్‌లో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. కందమాల్ జిల్లాలో ఇవాళ జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు మావోయిస్టులు మృతి (Three Maoists killed) చెందారు.

ఒడిస్సా పోలీసు డీఐజీ (ఆపరేషన్స్) అఖిలేశ్వర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం… సంఘటనా స్థలం నుంచి రెండు ఇన్సాస్ రైఫిల్స్, ఒక .303 రైఫిల్ సహా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల ఒడిస్సాలో మావోయిస్టు కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌లు (Special operations) చేపట్టారు. ఈ ఎన్‌కౌంటర్ కూడా ఆ ఆపరేషన్‌లో భాగమేనని అధికారులు తెలిపారు. ఘటనాస్థలంలో పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేసి శోధనలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో మావోయిస్టు బలగాలకు మరో దెబ్బ తగిలినట్లు పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి.