Forensics | హత్యా? ఆత్మహత్యా? కోణంలో దర్యాప్తు

Forensics | హత్యా? ఆత్మహత్యా? కోణంలో దర్యాప్తు

Forensics | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ముంబైలో పుచ్చకాయ తిని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన కేసులో సంచలన మలుపు చోటుచేసుకుంది. పుచ్చకాయ తినడం వల్ల వారు చనిపోలేదని ఫోరెన్సిక్ ప్రాథమిక నివేదిక స్పష్టం చేసింది. దీంతో ఈ ఘటన హత్యా? లేక ఆత్మహత్యా? అనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

ప్రాథమికంగా ఇది ఫుడ్ పాయిజన్ కేసుగా భావించిన పోలీసులు, ఫోరెన్సిక్ నివేదిక వెలుగులోకి రావడంతో దర్యాప్తు దిశను మార్చారు. కుటుంబ పెద్ద అబ్దుల్లా శరీరంలో మార్ఫిన్‌ అనే శక్తివంతమైన పెయిన్‌కిల్లర్ ఆనవాళ్లు గుర్తించినట్లు వైద్యులు వెల్లడించారు.

అలాగే బాధితుల మెదడు, గుండె, పేగులు సహా కొన్ని అంతర్గత అవయవాలు ఆకుపచ్చ రంగులోకి మారినట్లు రిపోర్ట్‌లో పేర్కొన్నారు. సాధారణ ఫుడ్ పాయిజన్ కేసుల్లో ఇలాంటి లక్షణాలు కనిపించవని వైద్యులు స్పష్టం చేశారు.

పుచ్చకాయతో పాటు ఇంట్లో ఉన్న ఇతర ఆహార పదార్థాలను కూడా పరీక్షించగా, వాటిలో ఎలాంటి కృత్రిమ రసాయనాలు లేవని తేలింది. దీంతో కుటుంబ సభ్యుల మృతిపై అనుమానాలు మరింత పెరిగాయి.

ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పుడు హత్య జరిగిందా? లేక కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి ఫోరెన్సిక్ నివేదిక కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.

Leave a Reply