Road accident | రోడ్డు ప్రమాదంలో మెస్సీ సోదరికి గాయాలు

Road accident | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : అర్జెంటీనా లో జ‌రిగే రోడ్డు ఫుట్‌బాల్ స్టార్ ప్లేయ‌ర్ లియోన‌ల్ మెస్సీ సోదరి సోల్ మెస్సీ గాయ‌ప‌డ్డారు. ఈ రోజు ఉదయం ఆమె తన ఎస్‌యూవీ కారులో వెళుతుండ‌గా అదుపు త‌ప్పి ఓ గోడకు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సోల్ మెస్సీకి తీవ్ర గాయాలయ్యాయి. మడమ, మణికట్టులో పగుళ్లు వచ్చినట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ప్రమాదం నుంచి ఆమె ప్రాణాలతో బయటపడినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ ప్రమాదం కారణంగా జనవరి 3న జరగాల్సిన మెస్సీ సోదరి వివాహం వాయిదా పడింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Leave a Reply