ప్రఖ్యాత సంగీత దర్శకుడు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ ఫోటోలను ఇళయరాజా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
‘‘మోడీజీతో ఇది చిరస్మరణీయమైన సమావేశం. నా ‘సింఫనీ-వాలియంట్’తో సహా పలు అంశాలను మేము చర్చించాము. ఆయన ప్రశంస, మద్దతుకు నేను కృతజ్ఞుడను’’. అని ఇళయరాజా పేర్కొన్నారు.
ఇళయరాజా ఇటీవల లండన్‌లో ‘వాలియంట్’ పేరుతో ఒక సంగీత కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. లండన్‌లో వెస్ట్రన్ క్లాసికల్ సింఫొనీని నిర్వహించిన తొలి ఆసియా సంగీత స్వరకర్తగా ఇళయరాజా రికార్డు సృష్టించారు.