Ghantasala | 30వ తేదీన వైకుంఠ ఏకాదశి..

Ghantasala | 30వ తేదీన వైకుంఠ ఏకాదశి..
Ghantasala | ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీకాకుళేశ్వరస్వామివారి దేవస్థానం నందు ఈ నెల 30వ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కార్యక్రమం జరుగుతుందని ఉపకమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. ఆదివారం ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించిన పోస్టర్లను అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి శ్రీరామ వరప్రసాదరావు వివరాలు తెలియజేశారు.
30వ తేదీ ఉదయం సుప్రభాత సేవ, విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనం, నవగ్రహ ఆరాధన, స్వామి, అమ్మవార్లకు సహస్రనామార్చన కార్యక్రమాలు జరుగుతాయని, ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవార్లకు ఆస్థాన పూజా కార్యక్రమం, 11.16 నిముషాలకు స్వామి, అమ్మవార్లు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. అనంతరం గరుడ వాహనంపై గ్రామోత్సవం, రాత్రి 8 గంటలకు రాజాధిరాజంపై గ్రామోత్సవం, అర్జిత సేవలు జరుగుతాయని భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. దేవస్థానం ఉద్యోగులు, అర్చకులు పాల్గొన్నారు.
