vavil Coll |Panchayat | సర్పంచ్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి

vavil Coll |Panchayat | హైదరాబాద్, ఆంధ్రప్రభ : వావిల్ కోల్ పంచాయతీ ఎన్నికలలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని గ్రామ కార్యదర్శి వేణు తెలిపారు. బుధవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎన్నిక అయిన సర్పంచ్ రజిత జంగారెడ్డి, ఉపసర్పంచ్ గంజి సైదమ్మ సురేష్, వార్డు సభ్యులను ఈ నెల22 వ తేదీ (రేపు) ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం గ్రామ రికార్డులను నూతనంగా ఎన్నిక అయిన కార్యవర్గానికి అందజేయడం జరుగుతుందన్నారు. వావిల్ కోల్ గ్రామ పంచాయతీ పరిధిలోని వావిల్ కోల్ , రుద్రాయిగూడెం, వడ్డెర గూడెం గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాల అమలుకు నూతన సర్పంచ్, ఉపసర్పంచ్ ల సహకారంతో తమవంతు కృషి చేస్తానని కార్యదర్శి తెలిపారు.
