Nizamabad | సర్పంచ్ బరిలో …

Nizamabad | సర్పంచ్ బరిలో …
Nizamabad | వేల్పూర్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ వేల్పూర్ మండలం రామన్నపెట్ గ్రామ అభ్యున్నతిని లక్ష్యంగా పెట్టుకొని యువ నాయకుడు బేల్దారి నవీన్(Beldari Naveen) సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలకు అభివాదం తెలుపుతూ ఆయన మాట్లాడుతూ.. రామన్నపేట్(Ramannapet)లో ఇంకా పరిష్కారం కావాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయని, వాటిని అధికారులతో ప్రశ్నించి పరిష్కరించే ధైర్యం, నిబద్దత తనకు ఉన్నట్టు తెలిపారు.
గ్రామ అభివృద్ధి కోసం చేపట్టబోయే కార్యక్రమాలు, పాకలీకృత రహదారులు, శుద్ధి చేసిన తాగునీటి సరఫరా, పేద కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, యువతకు ఉపాధి అవకాశాలు, క్రీడా మౌలిక వసతులు, పాఠశాలలు, అంగన్వా డీల అభివృద్ధి(Development), మహిళల శ్రేయస్సు కోసం ప్రత్యేక చర్యలు, శాంతి భద్రత కమిటీల ఏర్పాటు వంటి అంశాలను వివరించారు.
ప్రజల సమస్యలకు గళమెత్తే నాయకుడిగా పని చేస్తానని, రామన్నపేట్ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని న మ్మకంగా చెప్పాడు.గ్రామ ప్రజల ఆశీస్సులు,యువత ఉత్సా హంతమకు బలాన్నిస్తాయన్నారు. అభివృద్ధి మా లక్ష్యం, ప్రజా సేవ మా ధర్మం అని బేల్దారి నవీన్ సూచించారు.
