Shiva Mala Dharana | నియమనిష్ఠలతో చేయాలి

Shiva Mala Dharana | నియమనిష్ఠలతో చేయాలి

  • శివనామస్మరణతో మార్మోగుతున్నఊట్కూర్

Shiva Mala Dharana | ఊట్కూర్, ఆంధ్రప్రభ : శ్రీశైల మల్లికార్జున స్వామి శివ మాలధారణ చేపట్టిన స్వాములు మాలధారణ నియమనిష్ఠలతో చేపట్టాలని గురు స్వాములు నేరేడుగం సిద్ధిరామయ్య, ప్రభులింగం, భీమ్ రెడ్డి,శంకర్, దేవేంద్రప్ప అన్నారు. ఇవాళ‌ తెల్లవారుజామున నారాయణపేట జిల్లా
ఊట్కూర్ మండల కేంద్రంలోని వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు స్వామివారికి మంగళహారతి అనంతరం గురుస్వాముల ఆధ్వర్యంలో 23 మందిస్వాములు శివ మాలధారణ చేపట్టారు.

ఈసందర్భంగా గురుస్వాములు మాట్లాడుతూ… శివమాలధారణ చేపట్టిన స్వాములు మండల దీక్ష 55 రోజులు 41 రోజు కఠోర దీక్ష చేపట్టాలన్నారు. శివ మాలధారణ చేపట్టడంతో ఊట్కూర్ మండల కేంద్రంలోని దేవి నగర్ విధి శివనామ స్మరణతో మార్మోగుతోంది.
మాలధారణ చేపట్టిన శివ స్వాములు నియమనిష్టలతో దీక్ష చేపట్టి శ్రీశైల మల్లికార్జున స్వామి సన్నిధికి ప్రతి ఏడాది పాదయాత్రన తరలివెళ్తారు. ఊట్కూర్ మండల కేంద్రంలోని దేవినగర్ లో వెలసిన శ్రీ వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో మాలధారణ చేపట్టిన శివ స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో మాలధారణ స్వాములు సందాపురం తిరుపతి, అనిల్, శివ, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply