Ootkur | ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా…

Ootkur | ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా…

Ootkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవకుడిగా పెద్ద జట్రం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని, పెద్ద జట్రం సర్పంచ్ వాకిటి వెంకటేష్ అన్నారు. ఇవాళ‌ నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్ద జట్రం పాలకవర్గాన్ని గ్రామస్తులు, వివిధ పార్టీల నాయకులు ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తూ ఎంపీడీకే అరుణ నిధులు తీసుకువచ్చి గ్రామాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. యువకుడిగా ప్రజలు తమపై ఎంతో నమ్మకం ఉంచి గెలిపించారని, వారందరి ఆశీర్వాదంతో గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతూ పార్టీలకతీతంగా ప్రతి వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ స్వాతి, వార్డు సభ్యులు, త‌దిత‌రులున్నారు.

Leave a Reply