YSR Colony | బాలుడు అదృశ్యం..

YSR Colony | బాలుడు అదృశ్యం..

YSR Colony | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నంలోని వైయస్సార్ కాలనీకి చెందిన 9 సంవత్సరాల మైనర్ బాలుడు అదృశ్యం అయినట్లు తల్లిదండ్రులు మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. పాఠశాలకు అని చెప్పి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. పలువురు బంధువుల ఇంటి దగ్గర ఉన్నాడేమో అని వెతికినా ఎంతకీ ఆచూకీ లభ్యం కాలేదని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మచిలీపట్నం పోలీసులు తెలిపారు.

Leave a Reply