41 days | శబరి యాత్రకు అయ్యప్ప స్వాములు..

41 days | శబరి యాత్రకు అయ్యప్ప స్వాములు..

41 days | నిజాంపేట, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయ ఆవరణలో బుధవారం గురుస్వాములు బజార్ రంజిత్ గౌడ్, కృష్ణమూర్తి, యాదగౌడ్ ల ఆధ్వర్యంలో ఇరుముడి కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… 41 రోజులు(41 days) అయ్యప్ప స్వాములు కఠోర ఉపవాస దీక్షలను పూర్తిచేసుకుని అయ్యప్ప స్వామి వారికి ధూప దీప నైవేద్యాలను సమర్పించి ఇరుముడితో శబరి యాత్రకు బయలుదేరారు.

ఆ హరిహర పుత్రుని అయ్యప్ప స్వామి కృపతో గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి వారిని వేడుకున్నామన్నారు. అనంతరం అయ్యప్ప స్వాములు అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించి అయ్యప్ప భజన సంకీర్తనలు ఆటపాటల మధ్య చిందులు వేస్తూ శోభయాత్రగా ఇరుముడితో శబరి కొండ(Sabari Konda) హరిహరపుత్ర దర్శన భాగ్యం కోసం బయలుదేరారు.

స్వాముల శోభాయాత్రతో గ్రామంలో ఒక ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో దాతల సహకారంతో గ్రామంలో అయ్యప్ప ఆలయ నిర్మాణానికి(construction) కంకణ బుద్ధులం అవుతామన్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు పెద్ద పైడి నవీన్ రెడ్డి, వీరమల్లు బాలకృష్ణ, నాయినివెంకటేశం, కల్వకుంట సర్పంచ్ అందే కొండల్ రెడ్డి, బాల్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, రామచంద్రం, ధనంజయ, నరేష్ గౌడ్, కృష్ణ కాంత్, శ్రావణ్, సతీష్, హరి, నవీన్ గౌడ్, ప్రణయ్ గౌడ్, బాల్ నర్సాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply