ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి..

- పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి శిక్షణ
- ఎన్నికల సామాగ్రి పంపిణీ
- చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలో మూడో విడత ఈనెల 17వ తేదీన జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలింగ్ అధికారులు, సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చౌటుప్పల్ ఆర్డీవో వి.శేఖర్ రెడ్డి తెలిపారు.
చౌటుప్పల్ పట్టణంలోని ఎస్ఎం రెడ్డి ఫంక్షన్ హాల్ లో మంగళవారం పోలింగ్ నిర్వహణ, కౌంటింగ్, రిజల్ట్స్ తదితర విషయాలకు సంబంధించి ఎన్నికల సిబ్బందికి అధికారులు శిక్షణ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆర్డివో మాట్లాడుతూ… పోలింగ్ సందర్భంగా ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మండలంలోని 26 గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల ఎన్నికల సిబ్బందికి ఆర్డీవో శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు. ఎన్నికల సిబ్బంది తమకు అందజేసిన ఎన్నికల సామాగ్రిని తీసుకొని కామకో కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు.
ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ వీరాబాయి, ఎంపీడీవో సందీప్ కుమార్ తదితర అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

