Forest officials | కామారెడ్డి సరిహద్దుల్లో పెద్దపులి సంచారం…

Forest officials | కామారెడ్డి సరిహద్దుల్లో పెద్దపులి సంచారం…
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవి శాఖ అధికారుల సూచన..
Forest officials | నిజాంపేట, ఆంధ్రప్రభ : కామారెడ్డి, మెదక్ జిల్లాల సరిహద్దుల్లో పెద్దపులి సంచరించడంతో గ్రామాల్లోని పశువులపై దాడులు చేసే అవకాశం ఉన్నదని గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారి విద్యాసాగర్(Vidyasagar) తెలిపారు. నిజాంపేట మండలంలోని నస్కల్, నందగోకుల్, చల్మెడ, జిల్లా సరిహద్దు గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
పెద్దపులి ఏ సమయంలోనైనా రావచ్చని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నిరంతరం ఫారెస్ట్ అధికారులు( Forest officials గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు. రాత్రి వేళలో ప్రజలు పొలాల వద్దకు వెళ్లవద్దని గ్రామ ప్రజలకు సూచించారు.
